కృష్ణవంశీ వెర్సెస్ క్రిష్..
Tuesday, March 8, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బాలయ్య వందో సినిమా దర్శకుడు ఎవరనేది అటు అభిమానుల్లోను...ఇటు ఇండస్ట్రీలోను రోజురోజుకు ఆసక్తిని కలిగిస్తుంది. అయితే.. బాలయ్య మనసులో రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి కృష్ణవంశీ రైతు, రెండు క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ రెండు కథలు బాలయ్యకు నచ్చాయి. కానీ...ఏ కథతో వందో సినిమా చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. అమావాస్య తరువాత బాలయ్య వందో సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారట.
ఈ రెండింటిలో ఏదో ఒకటి 100వ సినిమా అవుతుంది. రెండోది 101వ సినిమా అవుతుంది. ఈ రెండు కథలు కంటే ముందు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కథ చెప్పారు. ఈ సినిమా ద్వారా బాలయ్య వారసుడు మోక్షజ్నని పరిచయం చేయాలనుకున్నారు. కృష్ణవంశీ - క్రిష్ చిత్రాల తర్వాత సింగీతం సినిమా ఉండొచ్చు. మరి...కృష్ణవంశీ - క్రిష్..ఈ ఇద్దరిలో బాలయ్య ఎవరికి వందో సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments