కృష్ణవంశీ వెర్సెస్ క్రిష్..

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

బాల‌య్య వందో సినిమా ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది అటు అభిమానుల్లోను...ఇటు ఇండ‌స్ట్రీలోను రోజురోజుకు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అయితే.. బాల‌య్య మ‌న‌సులో రెండు క‌థ‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి కృష్ణ‌వంశీ రైతు, రెండు క్రిష్ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ రెండు క‌థలు బాల‌య్య‌కు న‌చ్చాయి. కానీ...ఏ క‌థ‌తో వందో సినిమా చేయాల‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అమావాస్య త‌రువాత బాల‌య్య వందో సినిమా విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌.
ఈ రెండింటిలో ఏదో ఒక‌టి 100వ‌ సినిమా అవుతుంది. రెండోది 101వ సినిమా అవుతుంది. ఈ రెండు క‌థలు కంటే ముందు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 క‌థ చెప్పారు. ఈ సినిమా ద్వారా బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్న‌ని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. కృష్ణ‌వంశీ - క్రిష్ చిత్రాల త‌ర్వాత సింగీతం సినిమా ఉండొచ్చు. మ‌రి...కృష్ణ‌వంశీ - క్రిష్..ఈ ఇద్ద‌రిలో బాల‌య్య ఎవ‌రికి వందో సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఇస్తారో చూడాలి.

More News

13 న ప్రేమికుడు ఆడియో

మానస్.యన్ ,సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో డిజీ పోస్ట్ సమర్పణలో ఎస్ .ఎస్ సినీమాస్ బ్యానర్ పై లక్ష్మి నారాయణ రెడ్డి.కె ,ఇసానాక సునీల్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "ప్రేమికుడు ".

డిల్లీలో రోబో సీక్వెల్....

సూపర్ స్టార్ రజనీకాంత్,అక్షయ్ కుమార్,ఎమీ జాక్సన్ ప్రధానతారాగణంగా శంకర్ రూపొందిస్తోన్న చిత్రం'2.0'.

బాలకృష్ణపై కేస్ ఫైల్..

నందమూరి బాలకృష్ణపై ఇప్పుడు మహిళా సంఘాలన్నీ అగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాయి.

చిరంజీవి తనయ పెళ్ళి వేదిక మారింది

మెగాస్టార్ చిరంజీవి తన రెండో తనయ శ్రీజకు పెళ్ళి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నాడు.

తెలుగులో సూర్య డబ్బింగ్..?

సూర్య హీరోగా,నిర్మాతగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 24.