పాపం..కృష్ణవంశీ
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ..రుద్రాక్ష అనే చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. కథ రెడీ అయ్యింది. నిర్మాత దిల్ రాజు రెడీగా ఉన్నాడు.ఆర్టిస్టుల డేట్స్ కూడా తీసుకున్నారు. గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న కథ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. ఇంతలో..బాలయ్య వందో సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కృష్ణవంశీ దగ్గరకి వచ్చింది. ఇంకేముంది రుద్రాక్షని పక్కనపెట్టి బాలయ్య వందో సినిమా గురించి కథా చర్చలు ప్రారంభించాడు కృష్ణవంశీ.
ఇంతలో బాలయ్య వందో సినిమా డైరెక్టర్స్ లిస్ట్ లో కృష్ణవంశీతో పాటు క్రిష్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయినా కృష్ణవంశీ ప్రయత్నించారు. బాలయ్య కృష్ణవంశీ - క్రిష్ ఈ ఇద్దరిలో ఎవరికి వందో చిత్రం బాధ్యతలు అప్పచెప్పాలనే విషయం పై చాలా రోజులు ఆలోచించి ఆఖరికి క్రిష్ కే ఆ బాధ్యత అప్పచెప్పారట. బాలయ్యను నమ్ముకుని కృష్ణవంశీ రుద్రాక్ష ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు బాలయ్య వందో సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది. మళ్లీ రుద్రాక్ష వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్లీ ఆర్టిస్టుల డేట్స్ తీసుకోవాలి. పాపం...కృష్ణవంశీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments