'కృష్ణారావ్ సూపర్‌మార్కెట్' సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ 'కృష్ణారావ్ సూపర్‌మార్కెట్'. శ్రీనాధ్ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం అక్టోబర్ 18న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో..
నటుడు గౌతంరాజు మాట్లాడుతూ - "మా సినిమా 'కృష్ణారావ్ సూపర్‌మార్కెట్' యూత్ ఫుల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది. మా సినిమాకు అన్ని పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన మీడియా కి నా ధన్యవాదాలు. క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ అలానే సస్టైన్ అయ్యి ఆడియన్ ని థ్రిల్ చేస్తుంది. మా డైరెక్టర్ కొత్త వారైనా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా నడిపి సినిమాను ఒక ఎత్తుకు తీసుకెళ్లాడు. అలాగే మా అబ్బాయి కృష్ణ ముందు నుండి చిరంజీవి గారి అభిమాని. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ఈ సినిమాలో బాక్సర్ పాత్ర కోసం బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. మా టీం అందరికీ ..మంచి సినిమా చేశారు అని అప్రిసియేషన్ వస్తోంది. అయితే నేను ఇండస్ట్రీ కి వచ్చి 33 సంవత్సరాలు అయింది. చాలా మందికి చాలా విధాలుగా సాయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు మీ మీడియాకు నా మనవి ఏంటంటే 'మా సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లండి. ఇంకా మంచి హైప్ వచ్చేలా చేయండి' . దానివల్ల మరి కొంత మందికి సహాయం చేసే అవకాశం లభిస్తుంది" అన్నారు.
హీరో కృష్ణ మాట్లాడుతూ - "సినిమా పాజిటివ్ వైబ్స్ తో వెళుతుంది. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చేసిన మా డైరెక్టర్ గారికి థాంక్స్. ముఖ్యంగా సస్పెన్స్ బాగా సస్టైన్ చేశారని మంచి అప్లాజ్ వస్తోంది. యంగ్ టీమ్ చాలా కష్టపడి సినిమా చేశాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి" అన్నారు.
డైరెక్టర్ శ్రీనాధ్ పులకరం మాట్లాడుతూ - "సినిమా రిలీజై మా సక్సెస్ ను మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది అని ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఎక్కడో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఈ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా స్ట్రగుల్స్ ని దాటి ఎంతో కష్టపడి సినిమా తీశాం. దయచేసి మీడియా సపోర్ట్ చేయండి" అన్నారు.
నటీనటులు... కృష్ణ, ఎల్సాగోష్, తనికెళ్ళభరణి, గౌతంరాజ్, బెనర్జీ, రవిప్రకాష్, సూర్య, సన, దొరబాబు, సంజు, సహస్ర, తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com