ఓ లైఫ్ చూసినట్టుగా అనిపించింది - కృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్ జీవితాన్ని 'యన్.టి.ఆర్' అనే బయోపిక్‌గా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో తొలి భాగం 'యన్.టి.ఆర్ కథానాయుకుడు' జనవరి 9న విడుదలైంది. కృష్ణ, విజయ నిర్మల ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ "నందమూరి బాలకృష్ణ రూపొందించిన యన్.టి.ఆర్ బయోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసినట్లు కాకుండా ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది. బాలకృష్ణగారు.. ఎన్టీఆర్‌గారిలా వందశాతం కనిపించారు. ఆయన వేసిన అన్నీ గెటప్స్‌లోనూ బావున్నారు. డెఫనెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.
విజయ నిర్మల మాట్లాడుతూ "నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్‌గారితో కలిసి ‘పాండు రంగ మహత్యం’ చేశాను. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించాను. బయోపిక్ చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూస్తున్నట్లుండేలా బాలకృష్ణగారు నటించారు. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం"అన్నారు.
నరేశ్ మాట్లాడుతూ "యన్.టి.ఆర్’ బయోపిక్ అనౌన్స్ అయినప్పుడు ఇందులో ఓ అవకాశం వస్తుందా! అని ఆసక్తిగా ఎదురుచూశాను. మా అమ్మగారి తొలి సినిమా ఆయనతోనే నటించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా సమయంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఈ బయోపిక్‌లో వేషం వేయాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బరావుగారి వేషం. ఆ సన్నివేశాలను నేను చేస్తున్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. దర్శకుడు క్రిష్‌గారు ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమాతో బాలకృష్ణగారు మహానటుడిగా అవతరించారు తనకు హ్యాట్సాఫ్" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments