కృష్ణ గాడి వీర ప్రేమ గాథ రిలీజ్ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
నాని నటించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని సరసన కొత్త అమ్మాయి మెహర్ పిర్జాడా నటించింది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ..ఫిబ్రవరి 5 స్పీడున్నోడు, కృష్ణాష్టమి..చిత్రాలు రిలీజ్ అవుతుండడంతో ఈ చిత్ర నిర్మాతల కోరిక మేరకు కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాన్ని వారం రోజులు లేటుగా అంటే ఫిబ్రవరి 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com