సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
నాని నటించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని సరసన కొత్త అమ్మాయి మెహర్ పిర్జాడా నటించింది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఆడియో ఆవిష్కరణోత్సవం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో శిల్ప కళావేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరై కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఆడియో సి.డి ని ఆవిష్కరించగా... అల్లరి నరేష్ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ థియేటర్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
కెమెరామెన్ రత్నవేలు మాట్లాడుతూ...ఈ సినిమా ద్వారా కెమెరామెన్ గా పరిచయం అవుతున్న యువరాజ్ నా దగ్గర వర్క్ చేసాడు.
యువరాజ్ టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా యువరాజ్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
గీత రచయిత కే.కే మాట్లాడుతూ...దూకుడు, ఆగడు, వన్..లెజెండ్..ఇలాంటి లెజండరీ ఫిలింస్ చేసిన బేనర్ లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో సింగిల్ కార్డ్ రాసే అవకాశం కల్పించిన డైరెక్టర్ హను రాఘవవూడికి థ్యాంక్స్. ఈ సినిమాలో పాటలు బాగా రాసానంటే దానికి కారణం హను రాఘవపూడి. ఆయనే నా నుంచి ఈ పాటలు రాయించుకున్నారు అన్నారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ...14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నాకు చాలా ప్రత్యేకం. వన్ సినిమా తర్వాత కూడా అదే ఫ్రెండ్ షిప్ వాళ్లతో కొనసాగుతుంది. ఇలాంటి వ్యక్తులను ఇప్పటి వరకు కలవలేదు. డైరెక్టర్ హను చాలా స్పెషల్. ఎందుకంటే అందాల రాక్షసి సినిమాను టి.వీలో చూసి ఒక్క నిమిషం ఆగిపోయాను. తను కథను రాసుకున్న తీరే వెరైటీగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కెమెరామెన్ యువరాజ్ గురించి చెప్పాలంటే..రత్నవేలు దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి తెలుసు. ఈ సినిమాతో మంచి కెమెరామెన్ గా పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. సామాన్యుడుగా కనిపించే అసామాన్యుడు నానికి ఇది మరో సక్సెస్ ఫుల్ మూవీ కావాలని కోరుకుంటున్నాను.గీత రచయిత కే.కే చాలా మంచి పాటలు అందించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ...14 రీల్స్ సంస్థలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పాటలు మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ...రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర వీరు అభిరుచి గల నిర్మాతలు. హను రాఘవపూడి ఈ సినిమాతో మంచి హిట్ కొడతారు. నాని గురించి మాట్లాడడం అంటే నా గురించి నేను మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదైనా కొత్తగా చూపించాలని తపిస్తుంటాడు. భలే భలే మగాడివోయ్ కన్నా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ...పిలవగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వస్తానని మాట ఇచ్చి వచ్చిన సూపర్ స్టార్
మహేష్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాం. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పుల వలన నిర్మాణ పరంగా కాస్తా ఇబ్బంది పడ్డాం. అయితే 14 రీల్స్ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని చాలా మంది కోరుకున్నారు. వారందరికీ ధ్యాంక్స్. నాని చాలా సపోర్ట్ చేసాడు. మేం ముగ్గురం విని కన్ ఫర్మ్ చేసిన సినిమాలు బిగ్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలా హిట్ అవుతుందని ఆశిస్తున్నాం అన్నారు.
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ...టీం అంతా చాలా కష్టపడి వర్క్ చేసాం. నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ ముగ్గురు గురించి మాట్లాడడం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టు ఉంటుంది. నాని చాలా బాగా నటించాడు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ మెహర్ పిర్జాడా మాట్లాడుతూ...ఈ సినిమాలో నేను మహాలక్ష్మి క్యారెక్టర్ చేసాను. ఈ క్యారెక్టర్ ను చాలా ఇష్టపడి చేసాను. ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. తెలుగులో మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నాని ఈ పాత్ర చేయడానికి చాలా సపోర్ట్ చేసాడు. 14 రీల్స్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ...ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్ సినిమా. మహేష్ గారు రావడంతో ఇంకా స్పెషల్ మూవీ అయ్యింది.
హను కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఎందుకంటే చాలా కొత్తగా ఈ సినిమా తీసాడు. నిర్మాతలు అసిస్టెంట్ డైరెక్టర్స్ లా వర్క్ చేసారు.
రాజు సుందరం మాస్టర్, విజయ్ మాస్టర్ అందరూ పిల్లర్స్ లా ఈ సినిమాకి వర్క్ చేసారు. ఈ సినిమా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ...ఈ ఫంక్షన్ కి రావడం సంతోషంగా ఉంది. 14 రీల్స్ అంటే నా సొంత సంస్థ లాంటిది. సుకుమార్ గారు
చెప్పినట్టు అలాంటి నిర్మాతలను చూడలేదు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసస్పూర్తిగా కోరుకుంటున్నాను. భలే భలే మగాడివోయ్ చూసాను. నాకు బాగా నచ్చింది. నాని నటన అవుట్ స్టాండింగ్. ఈ సినిమా కెమెరామెన్ యువరాజ్ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత స్రవంతి రవి కిషోర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout