ఘనంగా జరిగిన సూపర్‌స్టార్ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
పద్మ భూషణ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలు మే31న హైదరాబాద్ పద్మాలయ స్టూడియోస్‌లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి వచ్చిన ఘట్టమనేని కృష్ణ, మహేష్ అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో తన అభిమానుల మధ్య సూపర్‌స్టార్‌కృష్ణ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు జి. ఆది శేషగిరి రావు, మెగా మూవీమేకర్ సి. అశ్వినిదత్, సరిలేరు నీకెవ్వరు నిర్మాత అనిల్ సుంకర, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు బి. ఏ రాజు, సేఖమూరి మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పాత్రికేయులు ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ - '' నా ప్రతి సంవత్సరం పుట్టిన రోజున నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రులతో పాటు నాకు సినీ జన్మనిచ్చిన 'తేనెమనసులు' దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారిని, 'గూఢచారి 116' నిర్మాత ధూండి గారిని తలుచుకుంటాను. మీ అందరి అభిమానంతోనే 350 సినిమాల్లో నటించగలిగాను, మీ అభిమానమే మాకు శ్రీరామ రక్ష. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న మహేష్ బాబు 26 సినిమా 'సరిలేరు నీకెవ్వరు' తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది''అన్నారు
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - '' సూపర్ స్టార్‌కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నిన్ననే పెద్దాయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాం. ఆయన పుట్టిన రోజున నాది సూపర్ స్టార్ మహేష్ మూవీ ప్రారంభం కావడం జన్మలో మర్చిపోలేను. మా సినిమా టైటిల్ 'సరిలేరు నీకెవ్వరూ' అని పెట్టాం. నిజంగా కృష్ణగారి గురించి చెప్పాలంటే ...సరిలేరు నీకెవ్వరు ఆ ఒక్క పదం సరిగ్గా సరిపోతుంది. ఒక హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అటెంప్ట్ చేయని జోనర్ అంటూ లేదు. ప్రతి జోనర్‌లోనూ ఆయనకు సూపర్‌హిట్స్ ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు అభిమానులకి నేను సూపర్‌స్టార్ మహేష్‌తో చేయబోయే సినిమా మీ అందరికి నచ్చేవిధంగా ఉండి, తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుంది'' అన్నారు.
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ - సూపర్ స్టార్ కృష్ణ గారికి 77వ జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఆయన ఒక స్టార్. ఆయన వెలుగులో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఈ రోజు అద ష్టవశాత్తు మా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ప్రారంభోత్సవం జరిగింది. కృష్ణ గారి పుట్టిన రోజున 'దూకుడు' సినిమా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తేనే 'దూకుడు' అంత పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సంవత్సరం ఏకంగా ఓ సినిమా ప్రారంభోత్సవం చేశాం. ఇక ఆ సినిమా ఈ రేంజ్‌లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సూపర్‌స్టార్ కృష్ణ గారి మాస్ సినిమాలా ఉంటుంది. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.
నిర్మాత బి ఏ రాజు మాట్లాడుతూ - '' సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతోమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్‌లని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నన్ను కూడా ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నా ప్రతి ఎదుగుదలలోనూ ఆయనే ఉన్నారు'' అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షులు దిడ్డి రాంబాబు, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన అధ్యక్షులు ఖాదర్ ఘోరీ పాల్గొని కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments