సరదాగా ఒక శాంపిల్ చూస్తారేటి? అంటున్న కృష్ణ భగవాన్ !!
Send us your feedback to audioarticles@vaarta.com
"సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో, "దేశవాళీ వినోదం" అనే స్లోగన్ తో తెగ సందడి చేస్తూ.. అందరి మనసుల్లోకీ దూసుకుపోతున్న "జయమ్ము నిశ్చయమ్మురా" చిత్రం టీమ్ తాజాగా.. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు కృష్ణ భగవాన్ పోషించిన "అడపా ప్రసాద్' అనే పాత్ర శాంపిల్ లుక్ మరియు టీజర్ లాంచ్ చేసింది.
ఈ చిత్రంలో ప్రవీణ్ పోషించిన "తత్కాల్" క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు విశేషమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో తాజాగా "అడపా ప్రసాద్" శాంపిల్ లుక్ మరియు టీజర్ ను "జయమ్ము నిశ్చయమ్మురా" టీమ్ విడుదల చేసింది.
మునిసిపల్ ఆఫీస్ లో సీనియర్ సూపరింటెండెంట్ గా పనిచేసే "అడపా ప్రసాద్" (కృష్ణ భగవాన్) అనే వ్యక్తి ఎవరైనా సంతోషంగా ఉంటె అస్సలు చూడలేడు. సదరు సంతోషానికి ఏదోవిధంగా తక్షణం భగ్నం కలిగించేంతవరకు అతని మనసుకు శాంతి ఉండదు. "ఒక శాంపిల్ చూస్తారేటి?" అన్నది అతగాడి ఊతపదం.
"అడపా ప్రసాద్" క్యారెక్టరైజేషన్ తాలూకు శాంపిల్ తెలుసుకోవాలంటే .. ఈ టీజర్ చూడాల్సిందే" అంటోంది చిత్ర బృందం.
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 24న విడుదల చేసేందుకు దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి సన్నాహాలు చేస్తున్నారు.
ఏ.వి.ఎస్.రాజు సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రదర్శన హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలింస్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకోగా.. వారి నుంచి నైజాం హక్కులు సుధాకర్ రెడ్డి (నితిన్ తండ్రి) తీసుకోవడం తెలిసిందే !!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com