ఓటేయడానికి వచ్చి లిఫ్ట్‌‌లో ఇరుక్కుపోయిన కృష్ణ దంపతులు

  • IndiaGlitz, [Sunday,March 10 2019]

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఓటేయడానికి సభ్యులంతా తరలివచ్చారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణమంతా నటీనటులతో కిక్కిరిసింది. ఒక్క ఎన్నికల సమయంలో తప్ప.. ఈ రేంజ్‌‌లో సభ్యులు ఇలా ఒక్కసారిగా రావడం చాలా అరుదనే చెప్పుకోవచ్చు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం రెండు గంటల వరకే కావడంతో త్వరత్వరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సభ్యులంతా ఫిలిం ఛాంబర్‌ చేరుకున్నారు.

లిఫ్ట్‌‌లో ఇరుక్కుపోయిన కృష్ణ దంపతులు

అధ్యక్ష పదవికోసం సీనియర్ నటుడు, సూపర్‌‌స్టార్ కృష్ణ కుమారుడు నరేశ్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం 12 గంటల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కృష్ణ దంపతులు ఛాంబర్‌‌కు వచ్చారు. విజయనిర్మల, కృష్ణ లిఫ్ట్‌‌లో వెళ్లేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్‌‌లో కూర్చున్న రెండు నిమిషాలకే కరెంట్ నిలిచిపోవడంతో ఆమె అక్కడే ఇరుక్కుపోయారు. సుమారు 20 నిమిషాల పాటు కృష్ణ దంపతులిద్దరూ లిఫ్ట్‌‌లోనే ఉండిపోయారు. అరగంట తర్వాత విద్యుత్ పునరుద్దరించడంతో కృష్ణ, విజయనిర్మల ఓటేసి వెళ్లిపోయారు.

More News

ఒకే కారులో వచ్చి ఓటేసిన చిరు, నాగ్.. నరేశ్‌దే గెలుపు!

‘నువ్వా.. నేనా’ అంటూ రసవత్తరంగా జరుగుతున్న ‘మా’ ఎన్నికల్లో.. కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచడం బాధాకరం: నరేశ్

‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ రియల్ లైఫ్‌‌లో శివాజీ రాజా.. నరేశ్ తలపడుతున్నారు.

రికార్డ్ స్థాయిలో ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్..

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గత పది రోజులగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు 50శాతం తెరపడింది.

కుప్పకూలిన విమానం.. 157 మంది దుర్మరణం..!?

థియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 విమానం(ET 302) ఒకటి కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వైసీపీ ఎఫెక్ట్.. ఆ పార్టీ గుర్తు పక్కనెట్టిన ఎన్నికల కమిషన్!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.