కరోపా ఎఫెక్ట్‌తో మార్చి చివరి వారం నుండి ఇప్పటి వరకు సినిమా థియేటర్స్ మూత పడ్డాయి. రిలీజ్‌లేవీ లేవు. స్టార్ హీరోలు, ఓ మోస్తరు బిజినెస్ ఉన్న స్టార్స్ సినిమాల రిలీజస్ గురించి ఎవరు మాట్లాడటం లేదు. అసలు ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. దీంతో కొందరు నిర్మాతలు వారి సినిమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ పంథాలో ఇప్పటికే కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, షాలిని వాడికంటి, శీరత్ కపూర్ హీరోయిన్స్‌గా రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
వైజాగ్‌లో ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన కృష్ణ(సిద్ధు జొన్నలగడ్డ) కాలేజీ సమయంలో సత్య(శ్రద్ధా శ్రీనాథ్)తో ప్రేమలో ఉంటాడు. అయితే కృష్ణ కంటే సీనియర్ అయిన సత్య, కృష్ణ ఆతృత, అనుమానం చూసి మనిషిగా ఇంకా పరిణితి చెందాలనే కారణాన్ని చూపి బెంగుళూరుకి జాబ్ చేయడానికి వెళ్లిపోతుంది. తర్వాత కృష్ణ తన జూనియర్ అయిన రాధ(షాలిని)ని ప్రేమిస్తాడు. ఇద్దరూ ప్రేమలో ఉండగానే కృష్ణ ఇంజనీరింగ్ పూర్తి కావడం బెంగళూరులో జాబ్ రావడం జరుగుతాయి. కృష్ణ బెంగుళూరు వెళ్లడం రాధకు అసలు ఇష్టముండదు. కృష్ణ ఆమెను ఒప్పించి బెంగుళూరు వెళతాడు. అక్కడ రుక్సర్ ఇతర స్నేహితులతో పాటు సమయాన్ని గడుపుతుంటాడు. అనుకోకుండా ఓరోజు సత్య కనపడుతుంది. మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అదే సమయంలోరాధ తను ప్రేమలో ఉన్న విషయాన్ని సత్యకు చెప్పడు కృష్ణ. ఇద్దరితో పీకల లోతు ప్రేమలో ఉన్న కృష్ణ కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. దాని వల్ల అతనెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో, ఇద్దరు హీరోయిన్స్‌తో సీరియస్ ప్రేమ.. ఇద్దరిలో ఎవరినీ పెళ్లి చేసుకోవాలో తెలియని కన్‌ఫ్యూజన్.. ఆ సమయంలో హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే పాయింట్‌తో రూపొందించిన చిత్రమే కృష్ణ అండ్ హిస్ లీల. హీరో సిద్ధు లవర్ బాయ్ పాత్రలో చక్కగా నటించాడు. రొమాన్స్, ఎమోషన్స్ చక్కగా పండించాడు. అయితే ఇలాంటి కథ,కథనం అనుకుంటే ఉండే దానికి ఆ ఎమోషన్స్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్‌ను డీల్ చేయడంలో ఏ మాత్రం తేడా వచ్చినా సినిమా తేడా కొట్టేస్తుంది. హిందీలో ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలను ఎప్పటి నుండో చూస్తున్నాం. ఇలాంటి కాన్సెప్ట్‌లతో రూపొందిన తెలుగు చిత్రాల్లో ఆరెంజ్, మెంటల్ మదిలో సహా చాలానే రూపొందాయి. సినిమా అంతా రొమాంటిక్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఎమోషనల్‌గా అంత డెప్త్‌గా టచ్ చేయలేకపోయాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమాను కావాలనే సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక టెక్నికల్‌గా చూస్తే రవికాంత్ పేరెపు తొలి చిత్రం క్షణం అంత గొప్పగా తెరెక్కించలేకపోయాడనే చెప్పాలి. రెండు చిత్రాలకు చాలా తేడా ఉంది. రెండు చిత్రాల జోనర్స్ వేరు. అయితే మేకింగ్ పరంగా.. తొలి చిత్రమంతా ఎఫెక్టివ్‌గా మాత్రం ఈ చిత్రాన్ని రవికాంత్ తెరకెక్కించలేకపోయాడనే చెప్పాలి. శ్రీచరణ్ పాకాల సంగీతం కంటే నేపథ్య సంగీతం బావుంది. షానిల్ డియో, సాయిప్రకాశ్ ఉమ్మడి సింగు కెమెరా పనితం బావుంది. ఎడిటింగ్ ఓకే కానీ.. ఇంకా షార్ప్‌గా ఉండుంటే బావుండేది. అందుకు కారణం సెకండాఫ్. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, షాలిని, శీరత్ కపూర్, వైవా హర్ష, సంపత్ రాజ్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
బోటమ్ లైన్: కృష్ణుడి లీలలు ..రొటీన్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ
Comments