బోల్డ్ కాన్సెప్ట్‌తో క్రిష్‌

  • IndiaGlitz, [Wednesday,May 16 2018]

గ‌మ్యం, వేదం, కంచె వంటి డిఫ‌రెంట్ సినిమాల‌తో పాటు 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' వంటి హిస్టారిక‌ల్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు జాగర్ల‌మూడి క్రిష్‌. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్‌తో బాలీవుడ్ మూవీ 'మ‌ణిక‌ర్ణిక‌' తెర‌కెక్కిస్తున్నాడు.

బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన వీర‌నారి ఝాన్సీ ల‌క్ష్మీ బాయ్ జీవిత‌గాథ‌తో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత క‌న్న‌డ ర‌చ‌యిత భైర‌ప్ప రాసిన ప‌ర్వ అనే న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.

ప‌ర్వ అనే న‌వ‌ల మ‌హాభార‌తంలోని పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని రాశారు. ప‌లు వివాద‌స్ప‌ద విష‌యాల‌తో రూపొందించిన ఈ న‌వ‌ల‌తో క్రిష్ సినిమా రూర‌పొందిస్తే వివాదాలు లేకుండా సినిమా చేయ‌గ‌లుతాడా.. ఆలోచించాల్సిన అంశ‌మే మ‌రి...