డిజిట‌ల్‌లో నిర్మాత‌గా మారిన క్రిష్‌...!!

  • IndiaGlitz, [Saturday,March 21 2020]

విల‌క్ష‌ణ‌మైన కాన్సెప్ట్‌ల‌తో చిత్రాలు చేసే ద‌ర్శ‌కుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ముందు వ‌రుస‌లో ఉంటారు. గమ్యం, వేదం, కృష్ణంవందే జ‌గ‌ద్గుర‌మ్‌, కంచె వంటి చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. ఆయ‌న సినిమాల్లో ద‌ర్శ‌క‌త్వం చేయ‌డంతో పాటు నిర్మాణంలో కూడా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఆయ‌న ఇప్పుడు సినిమాల‌తో పాటు డిజిట‌ల్ రంగంలో కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌పామ్ ఆహాలో క్రిష్ స్క్రిప్ట్ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అల్లు అర‌వింద్ నిర్మాణ వ్య‌వ‌హారాల‌ను చూస్తుంటారు. అయితే ఆహాలో క్రిష్ కొత్త బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. అదేంటో కాదు.. నిర్మాణ బాధ్య‌త‌లు. స్క్రిప్ట్ వ్య‌వ‌హారాల‌తో పాటు ర‌న్ అనే వెబ్ సిరీస్‌కు క్రిష్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

మ‌రో ప‌క్క ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ మూవీ తెర‌కెక్కుతుంది. క‌రోనా ప్ర‌భావంతో షూటింగ్ ఆగింది. మొఘ‌ల్ కాలానికి చెందిన ఓ దొంగ క‌థ‌తో క్రిష్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. భారీ సెట్స్ కూడా సిద్ధం చేసుకున్న క్రిష్ ఈ ఏడాది ప్ర‌థ‌మార్థం ముగిసే లోపు ఈ సినిమా డైరెక్ష‌న్‌ను పూర్తి చేసేయాల‌నుకుంటున్నాడ‌ట‌. త‌ర్వాత వి.ఎఫ్‌.ఎక్స్ స‌హా ఇత‌ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో బిజీ కానున్నాడు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడట క్రిష్‌.

More News

కలకలం.. తెలంగాణ వ్యక్తికి తొలి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పటికే పలు దేశాలకు పాకిన ఈ వైరస్ భారత్‌కూ పాకడంతో పాటు..

బ‌న్నీ కొత్త వ్యాపారం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో భారీ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా కోసం స‌న్న‌ద్ధం అవుతున్నారు బ‌న్నీ.

ఆక‌ట్టుకుంటున్న బాల‌య్య స‌రికొత్త లుక్

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నెల‌లోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాల్సింది.

చేతులెత్తి దండం పెడుతున్నా సహకరించండి..: కేసీఆర్

ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారు. కరీంనగర్‌ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన

మ‌ల‌యాళ రీమేక్‌లో న‌టించేది ఎవ‌రు?

మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్‌, బిజూ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్పన్ కోశియ‌మ్‌’. కేర‌ళ‌లో మంచి వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.