క్రిష్ రాయబారి ఇతడే..
Send us your feedback to audioarticles@vaarta.com
కంచె సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించిన క్రిష్ తదుపరి చిత్రం కోసం రాయబారి అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ టైటిల్ రిజిష్టర్ చేయించారు. రాయబారి టైటిల్ ఎవరి కోసం అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే క్రిష్..నాగార్జున వారసుడు అఖిల్ కోసం రాయబారి అనే టైటిల్ రిజిష్టర్ చేయించారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతుంది.
కానీ మాకు అందిన సమాచారం ప్రకారం క్రిష్..కంచె హీరో వరుణ్ తేజ్ తో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. వరుణ్ తేజ్ తో రూపొందించే మూవీ కోసమే రాయబారి టైటిల్ రిజిష్టర్ చేయించారట. మరి..ఇది నిజమో కాదో తెలియాలంటే క్రిష్ చెప్పాలి...లేదా కొన్ని రోజులు ఆగాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com