కంగనాతో మళ్ళీ పని చేయను: క్రిష్
Send us your feedback to audioarticles@vaarta.com
హిందీ నటి కంగనా రనౌత్‌తో మళ్ళీ పని చేయనని దర్శకుడు క్రిష్ స్పష్టం చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా రూపొందిన హిందీ సినిమా 'మణికర్ణిక' విషయంలో కంగన, క్రిష్ మధ్య తలెత్తిన గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమా విడుదల తరవాత క్రిష్ బయటకొచ్చారు. విడుదలకు ముందు కంగనా రనౌత్ తనపై చేసిన ఆరోపణలకు ఆయన వివరణ ఇవ్వడమే కాదు.. కంగనా చేసిన తప్పులను బయటపెడుతున్నారు.
తాను స్వచ్ఛమైన బంగారం లాంటి సినిమా తీస్తే... దాన్ని కంగనా వెండిగా మార్చిందని క్రిష్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "కథలో మార్పులు చేసినందుకు సోనూ సూద్ తప్పుకున్నారు. ఆ మార్పుకు నేనూ వ్యతిరేకమే. దాన్ని ఆమె మరోలా చిత్రీకరించింది. మహిళ దర్శకత్వంలో నటించడం సోనూ సూద్ కి ఇష్టం లేక సినిమాను నుంచి తప్పుకున్నారని చెప్పింది. ఎన్టీఆర్ బయోపిక్ కోసం నేను సినిమాను వదిలేశానని చెప్పింది. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. మరోసారి ఆమెతో నేను పని చేయను. సినిమా విడుదలై విజయం సాధించిన తరవాత బయటకు రాలేదు. ముందు నుంచి విడుదల తరవాత మాట్లాడాలని నిర్ణయించుకున్నా" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments