క్రిష్ తదుపరి చిత్రం ఎవరితో..?
Send us your feedback to audioarticles@vaarta.com
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె...ఇలా విభిన్న కథా చిత్రాల దర్శకుడుగా విమర్శకుల ప్రశంసలందుకుంటున్న డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్. ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నగౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా తర్వాత క్రిష్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల విక్టరీ వెంకటేష్ కి క్రిష్ కథ చెప్పినట్టు సమాచారం. క్రిష్ చెప్పిన సోషియో ఫాంటసీ కథ విని వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే...తాజాగా క్రిష్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఓ లైన్ అనుకున్నాడట. గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కి క్రిష్ కథ చెబుతాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీతో మూవీ చేస్తున్నాడు. ఆతర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నట్టు సమాచారం. క్రిష్ కథకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే...2018లో ఈ సినిమా ఉండచ్చేమో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com