బాలీవుడ్‌లో క్రిష్ చిత్రం

  • IndiaGlitz, [Sunday,May 05 2019]

టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ట్ చేసిన య‌న్‌.టి.ఆర్ ప్లాప్ కావ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని సందిగ్ధ‌త నెల‌కొంది. అదే స‌మ‌యంలో ఆయ‌న బాలీవుడ్‌లో డైరెక్ట్ చేసిన 'మ‌ణిక‌ర్ణిక' క్రెడిట్‌ను కంగ‌నా త‌న ఖాతాలో వేసుకుంది. త‌దుప‌రి క్రిష్ ఏం చేయ‌బోతాడ‌నే దానిపై క్లారిటీ లేదు. కానీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం క్రిష్ బాలీవుడ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

గ‌తంలో క్రిష్ ఠాగూర్ సినిమాను అక్ష‌య్ కుమార్‌తో గ‌బ్బ‌ర్‌సింగ్ ఈజ్ బ్యాక్ పేరుతో తెర‌కెక్కించాడు. ఇప్పుడు మ‌రోసారి అక్ష‌య్‌కుమార్‌తోనే సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట క్రిష్‌. రీసెంట్‌గా అక్ష‌య్‌ను క‌లిసి క‌థ నెరేట్ చేశాడ‌ట‌. అక్ష‌య్‌కు క‌థ న‌చ్చింద‌ట‌. అంతా ఓకే అయితే.. క్రిష్‌, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతుంది.