క్రిష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

  • IndiaGlitz, [Friday,January 04 2019]

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు.

కాగా ఇందులో తొలి భాగం య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న‌.. య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌లవుతుంది. ముందుగా ఈ బ‌యోపిక్‌కి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సింది. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల తేజ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో క్రిష్ వ‌చ్చి జాయిన్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌కి ఆయ‌న‌కు ప‌ది కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.