ముగ్గురిలో.. క్రిష్ ఒక‌ర‌న్న‌మాట‌

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు ద‌ర్శ‌కులు.. ఓ స్టార్ డైర‌క్ట‌ర్ సినిమా. ఇదీ ఈ మ‌ధ్య అంద‌రి నోళ్ల‌ల్లో నానుతున్న విష‌యం. ఆ స్టార్ డైర‌క్ట‌ర్ పేరు రాఘ‌వేంద్ర‌రావు. ఆ ముగ్గురు హీరోయిన్లు, ద‌ర్శ‌కుల గురించి మాత్రం స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది. వారిలో ఒక‌రిగా ఇప్పుడు క్రిష్ పేరు వినిపిస్తోంది. ద‌ర్శ‌కుడిగా క్రిష్ అంటే రాఘ‌వేంద్ర‌రావుకు ప్ర‌త్యేక‌మైన అభిమానం. క్రిష్ సినిమాలు చూసి ఎన్నో సార్లు రాఘ‌వేంద్ర‌రావు బాహాటంగానే ప్ర‌శంసించారు.

వేదం, కంచె, మొన్న‌టికి మొన్న 'య‌న్‌.టి.ఆర్‌' గురించి కూడా రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడారు. నెట్టింట్లో ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ను సంపాదించుకున్న 'య‌న్.టి.ఆర్‌' సిల్వ‌ర్ స్క్రీన్ మీద పెద్ద సంద‌డి చేయ‌లేక‌పోయింది. ఈ బ‌యోపిక్ త‌ర్వాత క్రిష్ ఏం చేస్తార‌నే విష‌యం ప‌ట్ల కూడా ఆసక్తి నెల‌కొంది. బాలీవుడ్ సినిమా అని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని ఓ మంచి స‌బ్జెక్ట్ తో క్రిష్ ఈ మూడు క‌థ‌ల్లో ఓ క‌థ‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని అనుకుంటున్న‌ట్టు టాక్‌. ఇంత‌కీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రిని ఎంపిక చేసుకుంటారో చూడాలి మ‌రి.