నారి నారి న‌డుమ క్రిష్..!

  • IndiaGlitz, [Friday,December 30 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని తెర‌కెక్కించిన జాగ‌ర్ల‌మూడి క్రిష్, త‌న భార్య ర‌మ్య సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేసారు. ఈ ఫోటోలో డైరెక్ట‌ర్ క్రిష్ కు భార్య ర‌మ్య ముద్దుపెడుతుంటే....హీరోయిన్ శ్రియ క్రిష్ ను ప‌ట్టుకుని చంపేస్తా అన్న‌ట్టు న‌వ్వుతూ ఫోటోకు ఫోజు ఇచ్చింది. గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో రిలీజ్ రోజు ఇది జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో ఫంక్ష‌న్ లో క్రిష్ మాట్లాడుతూ...పెళ్లైన త‌ర్వాత భార్య ర‌మ్య‌తో క‌నీసం 10 రోజులు కూడా ఉండ‌లేదు. అయిన‌ప్ప‌టికీ న‌న్ను అర్ధం చేసుకుని ఎంత‌గానో స‌హ‌క‌రించింది. నా జీవితంలోకి వ‌చ్చినందుకు ధ‌న్య‌వాదాలు అని తెలియ‌చేసాడు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు.