సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శక్వంలో సినిమా ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సురేష్ బాబు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టగా క్రాంతి మాదవ్ గౌరవ దర్శకత్వంలో సునీల్, మియా హీరో హీరోయిన్లుగా యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ పతాకంపై నూతన చిత్రం సోమవారం హైదరాబాద్ దైవసన్నిధానంలో ప్రారంభమైంది. క్రాంతిమాధవ్ దర్శకుడు. పరుచూరి కిరిటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వి.వి.వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరై చిత్రయూనిట్‌ను అభినందించారు. రెండు గంటలు పాటు కథ విని, బౌండెడ్ స్క్రిప్ట్ తో సెట్స్ లోకి వెళుతున్నామని హీరో సునీల్ తెలియజేశారు. రెండు, మూడు నెలలుగా స్క్రిప్ట్‌తో యూనిట్ ట్రావెల్ చేస్తుందని, సునీల్ గారు కథ విని వెంటనే ఓకే చెప్పారని నిర్మాత పరుచూరి కిరిటీ అన్నారు. ఇప్పటి వరకు సునీల్ చేయని కామెడి రోల్ ఇది. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని క్రాంతిమాధవ్ అన్నారు.
సునీల్, మియా, సంపత్, అలీ, ఆశిష్ విద్యార్థి, వెన్నెలకిషోర్, పృథ్వీ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్ తదితరులునటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ః ఎ.యస్.ప్రకాష్, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్ః చంద్రమోహన్ చింతాద, మ్యూజిక్ః జిబ్రాన్, నిర్మాతః పరుచూరి కిరిటీ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః కె.క్రాంతిమాదవ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments