‘క్రాక్’ మొదలెట్టేశారు...!
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ చిత్రం` క్రాక్`. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా తుది దశ చిత్రీకరణ దశలో ఆగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో మన స్టార్స్ అందరూ సినిమాలను ట్రాక్ ఎక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రవితేజ ‘క్రాక్’ సినిమా షూటింగ్ కూడా షురూ అయ్యింది. పది నుండి పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు.
శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత రవితే, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రమిది. దర్శకుడిగా గోపీచంద్ మలినేని మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో క్రాక్ నిజంగానే బాక్సాఫీస్ వసూళ్లను క్రాక్ చేస్తుందేమో చూడాలి. సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలైంది. ఇందులో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలోఓ సినిమా చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments