‘క్రాక్‌’ మొదలెట్టేశారు...!

  • IndiaGlitz, [Wednesday,October 07 2020]

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ చిత్రం' క్రాక్‌'. ఈ ఏడాది వేస‌విలో ఈ సినిమా విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ కార‌ణంగా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఆగింది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్ప‌డంతో మ‌న స్టార్స్ అంద‌రూ సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ర‌వితేజ ‘క్రాక్‌’ సినిమా షూటింగ్ కూడా షురూ అయ్యింది. ప‌ది నుండి ప‌దిహేను రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావ‌డానికి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. డాన్ శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితే, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న స‌మ‌యంలో క్రాక్ నిజంగానే బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను క్రాక్ చేస్తుందేమో చూడాలి. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లైంది. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ర‌వితేజ ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేయ‌బోతున్నారు.

More News

బ‌రిలోకి దిగుతున్న య‌ష్‌

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2’.

శాంతించిన ఓపీఎస్.. ఈపీఎస్‌కు లైన్ క్లియర్..

గత కొద్ది రోజులుగా హాట్ హాట్‌గా నడుస్తున్న తమిళ రాజకీయాల్లో ఎట్టకేలకు ప్రశాంతత నెలకొంది. సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం  సీనియర్‌ మంత్రులు,

నవంబర్, డిసెంబర్ నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు: పార్థసారధి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నవంబర్ లేదంటే డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు.

క్రేజీ కాంబినేష‌న్‌...!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. తదుప‌రి సినిమా ఏంట‌నే దానిపై క్లారిటీ లేదు. అనుష్క ప‌లానా చిత్రంలో న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును ప్రకటించిన పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించారు. నిన్న మొన్నటి వరకూ ఉన్న విభేదాలన్నింటినీ పక్కనపెట్టి పళని స్వామి పేరును డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వమే