'క్రాక్‌' ఐటెమ్‌ సాంగ్‌ ...

  • IndiaGlitz, [Friday,October 16 2020]

డాన్‌శీను, బలుపు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ చిత్రం' క్రాక్‌'. ఈ ఏడాది వేస‌విలో ఈ సినిమా విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ కార‌ణంగా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఆగింది. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఓకే చెప్ప‌డంతో మ‌న స్టార్స్ అంద‌రూ సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ర‌వితేజ ‘క్రాక్‌’ సినిమా షూటింగ్ కూడా షురూ అయ్యింది. ప‌ది నుండి ప‌దిహేను రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావ‌డానికి పెద్ద స‌మ‌యం ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్‌ ఐటెమ్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్‌లో రవితేజతో అప్సరా రాణి చిందేస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న స‌మ‌యంలో క్రాక్ నిజంగానే బాక్సాఫీస్ వ‌సూళ్ల‌ను క్రాక్ చేస్తుందేమో చూడాలి. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌లైంది. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ర‌వితేజ ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేయ‌బోతున్నారు.

More News

మాజీ హోంమంత్రి నాయిని పరిస్థితి విషమం..

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

‘కేజీఎఫ్ 2’ కోసం సిద్ధమవుతున్న సంజయ్ దత్..

బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

నితిన్‌ 'చెక్'‌.. రీస్టార్ట్‌

హీరో నితిన్‌ కోవిడ్‌ ముందు వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే కోవిడ్‌ ప్రభావంతో సినిమాల షూటింగ్స్‌ ఆగిన సంగతి తెలిసిందే.

మరో సినిమాను ఖరారు చేసిన నాగశౌర్య

యువ కథానాయకుడు నాగశౌర్య వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. శుక్రవారం రోజున తన కొత్త చిత్రాన్ని నాగశౌర్య అనౌన్స్‌ చేశారు.

'మోసగాళ్లు'కు వెంకీ వాయిస్‌ ఓవర్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్లు’.