'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామరావు మాట్లాడుతూ ''తండ్రీకూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం. ఒక మంచి కథతో, పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నటుడు రాజేష్ కుమార్తె, హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు అయిన ఐశర్యారాజేష్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించింది.
ఐశ్వరా రాజేష్ తమిళ్, మలయాళ సినిమాలు చేసినా ఫిమేల్ క్రికెటర్‌గా మెయిన్ రోల్‌తో తెలుగులో ఎంటర్ అవుతోంది. అలాగే మా వైజాగ్ రాజుగారి అబ్బాయి కార్తీక్ రాజు హీరోగా చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌గారిది ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసిన ఆయనకు ఇది మరో గొప్ప క్యారెక్టర్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఎస్.ఐ.గా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడు. మా బేనర్‌లో మరో మంచి కథా చిత్రమిది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ మూడోవారంలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ''లేడీ క్రికెటర్ కథాంశంతో వస్తున్న విభిన్న చిత్రం. ఒక మంచి సబ్జెక్ట్‌తో, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్ చేయడం జరిగింది. 'శుభాకాంక్షలు', 'శుభమస్తు', 'సుస్వాగతం', 'సూర్యవంశం' వంటి ఫ్యామిలీ పిక్చర్స్ చేసిన నాకు దర్శకుడిగా 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్' ఎంతో సంతృప్తిని కలిగించింది. ఐశ్వర్యా రాజేష్ క్రికెటర్‌గా చేయడానికి ఎంతో డెడికేటెడ్‌గా ఆరు నెలలపాటు క్రికెట్ నేర్చుకొని ఈ చిత్రంలో నటించడం విశేషం. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రాణం. ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ ఒక స్పెషల్ రోల్ చేయడం ఈ చిత్రానికి హైలైట్. ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని అందరికీ కలిగిస్తుంది'' అన్నారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్, శివకార్తికేయన్(స్పెషల్ రోల్), ఐశ్వర్యా రాజేష్, కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్.నరసింహారావు, వెన్నెల కిశోర్, 'రంగస్థలం' మహేశ్, విష్ణు(టాక్సీవాలా ఫేమ్), రవిప్రకాశ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్, కథ: అరుణ్‌రాజా కామరాజ్, మాటలు: హనుమాన్ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్(కెకె), కాసర్ల శ్యామ్, రాంబాబు గోసల, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, డాన్స్: శేఖర్, భాను, ఆర్ట్: ఎస్.శివయ్య, కో-డైరెక్టర్: బి.సుబ్బారావు, ప్రొడక్షన్ కంట్రోలర్: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్.రామారావు, నిర్మాత: కె.ఎ.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com