తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

  • IndiaGlitz, [Wednesday,March 02 2022]

మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అందరిముందు చెప్పుతో కొట్టుకున్నారు. ఆయనేందుకు ఇలా చేశారంటే... పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తున్న ఏపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల విషయంలో మాత్రం మార్పులు చేపట్టింది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తున్న ప్రభుత్వం.. జిల్లా కేంద్రంగా భీమవరంను ప్రకటించింది. దీంతో నర్సాపురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా పలువురు నేతలు దీనికి మద్ధతు పలుకుతున్నారు. నర్సాపురాన్నే జిల్లాకేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి.

బ్రిటిష్‌, డచ్‌ హయాం నుంచి సబ్‌ డివిజన్‌గా ఉన్న నరసాపురం పట్టణాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జిల్లా కేంద్రం సాధన ఉద్యమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు అందరు నేతల్ని కలుపుకుపోతున్నారు. ఈ క్రమంలో అభ్యంతరాల పరిశీలన గడువు కూడా పూర్తవుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. ఈ క్రమంలో బుధవారం నర్సాపురంలో ర్యాలీ నిర్వహించిన కొత్తపల్లి మాట్లాడుతూ.. ఆ సందర్భంగా వేదికపై మాట్లాడుతూనే హఠాత్తుగా తన చెప్పును తీసుకుని కొట్టుకున్నారు.

More News

ఘనంగా జరుపున్న 'సెబాస్టియన్‌ పిసి524’ ప్రి. రిలీజ్ ఈవెంట్

పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యం లోని

కొత్త గా బ్రహ్మానందం తనయుడు గౌతమ్

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా  రూపొందతున్న సినిమా  గ్లిమ్స్ ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది

రష్యా- ఉక్రెయిన్ వార్: భారతీయుల ఇబ్బందులపై హీరో రామ్ పోతినేని ఎమోషనల్ ట్వీట్

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రస్తుతం అక్కడికి వెళ్లిన భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

టీడీపీ పెద్దాయనకు అశ్రు నివాళి.. యడ్లపాటి పాడె మోసిన చంద్రబాబు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంక్రటావు అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు.

మా వాడి జాతకానికి ముహూర్తం కుదరడం లేదు .. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ వాయిదా

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది',