టీడీపీలో చేరిన కోట్ల దంపతులు
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్దాలుగా కాంగ్రెస్లో ఉన్న కోట్ల కుటుంబం పార్టీకి 'చేయి' ఇచ్చి టీడీపీలో చేరిపోయింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ అంటే కోట్ల ఫ్యామిలీ.. కోట్ల అంటే కాంగ్రెస్ అన్న రీతిలో పరిస్థితులు ఉండేవి అయితే శనివారంతో ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో కోట్ల దంపతులు టీడీపీ కండువా కప్పుకున్నారు. శనివారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన టీడీపీ సభలో కోట్ల దంపతులు పసుపు కండువా కప్పేసుకున్నారు.
పార్టీ మారిన అనంతరం ఏమన్నారంటే..
"నేను కాంగ్రెస్ నుంచి బయటికి వద్దామనుకోలేదు. వాళ్లే నన్ను బయటికి పంపించారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి సరిగ్గా లేదు. కార్యకర్తలను కాపాడుకోవడానికి నేను టీడీపీలో చేరాను" అని కోట్ల చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout