మార్చి 9న 'కోటికొక్కడు'
Send us your feedback to audioarticles@vaarta.com
'ఈగ' ఫేమ్ సుదీప్ హీరోగా నిత్యమీనన్ హీరోయిన్‌గా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళ్ భాషల్లో రూపొందిన చిత్రం 'కోటిగొబ్బ-2'. ఈ చిత్రం ఇటీవల రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయి 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దుహర మూవీస్ పతాకంపై యువ నిర్మాత కళ్యాణ్ ధూళిపాళ్ల 'కోటికొక్కడు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ చిత్రం మార్చి 9న అత్యథిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, ప్రముఖ నిర్మాత, ఎస్.వి.ఆర్. మీడియా అధినేత్రి శోభారాణి, చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూళిపాళ్ల పాల్గొన్నారు.
చిత్ర నిర్మాత కళ్యాణ్ ధూళిపాళ్ల మాట్లాడుతూ - ''డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రీసెంట్‌గా 'రచయిత' సినిమా నిర్మించాను. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ చిత్రం చాలా మంచి పేరు తెచ్చింది. ఫస్ట్ చిత్రంతోనే అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నందుకు చాలా హ్యాపీగా వుంది. మా దుహర మూవీస్ బేనర్‌లో రెండో చిత్రంగా ఒక మంచి మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్న టైమ్‌లో కన్నడలో 'కోటిగొబ్బ-2' చిత్రం చూశాను.
నాకు బాగా నచ్చింది. నేను అనుకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. సుదీప్, నిత్యమీనన్, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం కన్నడ, తమిళ్ భాషల్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యి 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని 'కోటికొక్కడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎంతో ఎంకరేజ్ చేశారు. వారి కోరిక మేరకు ఈ చిత్రాన్ని మార్చి 9న 300 థియేటర్లకు పైగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగులో కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని కాన్ఫిడెంట్‌గా వున్నాం'' అన్నారు.
ప్రముఖ దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ - ''సుదీప్ నేషనల్ హీరో. ఇప్పటివరకు చాలా మంచి సినిమాలు చేశారు. అతను చేసిన బెస్ట్ సినిమాలలో 'కోటికొక్కడు' బిగ్గెస్ట్ హిట్ మూవీ. కె.ఎస్. రవికుమార్‌గారు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. రీసెంట్‌గా 'జై సింహా'తో సూపర్‌హిట్ కొట్టారు. ఆయన దర్శకత్వం వహించిన 'కోటిగొబ్బ-2' చిత్రం 120 కోట్లు కలెక్ట్ చేసింది. మా కళ్యాణ్ 'రచయిత' చిత్రంతో మంచి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను చేస్తున్న రెండో సినిమా 'కోటికొక్కడు' కూడా మంచి హిట్ అయ్యి బాగా డబ్బులు రావాలి. ఆల్‌రెడీ మా కాంబినేషన్‌లో ఒక సినిమా చేస్తున్నాం. షూటింగ్ జరుగుతోంది'' అన్నారు.
ఎస్.వి.ఆర్. మీడియా శోభారాణి మాట్లాడుతూ - ''మంచి సబ్జెక్ట్‌తో 'రచయిత' చిత్రాన్ని నిర్మించి అనుకున్న టైమ్‌లో రిలీజ్ చేసిన గట్స్ వున్న ప్రొడ్యూసర్ కళ్యాణ్. అతను టేస్ట్ వున్న నిర్మాత మాత్రమే కాదు.. మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత కూడా. ఇప్పుడు దుహర మూవీస్ బేనర్ ద్వారా 'కోటికొక్కడు' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. కె.ఎస్. రవికుమార్ అందరి హీరోలతో చాలా గొప్ప సినిమాలు తీశారు. 'జై సింహా' కంటే ముందు 'కోటిగొబ్బ-2' చిత్రాన్ని తీశారు.
ఆ చిత్రం చాలా పెద్దహిట్ అయ్యింది. తరువాత 'జై సింహా' చిత్రం తీశారు. ఆ చిత్రం కూడా సూపర్‌హిట్ అయ్యింది. 'కోటికొక్కడు' చిత్రాన్ని చూశాను. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం చాలా ఇంట్రెస్టింగా వుంటుంది. క్లైమాక్స్ అద్భుతంగా వుంటుంది. ఇంతవరకు అలాంటి క్లైమాక్స్ రాలేదు. డైరెక్టర్ రవికుమార్ ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. ప్రకాష్‌రాజ్ సుదీప్ ఫాదర్‌గా నటించారు. పాటలు చాలా రిచ్‌గా వుంటాయి. యాక్షన్ పార్ట్ స్టన్నింగ్‌గా వుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ఇది.
తెలుగులో కూడా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని చాలా నమ్మకం వుంది.ఈ సినిమాకి చాలా క్రేజ్ వుంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రానికి మంచి థియేటర్స్ ఇచ్చి చాలా కాన్ఫిడెన్స్‌తో రిలీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ నిర్మాత కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా కళ్యాణ్‌కి పెద్ద హిట్ అవ్వాలి'' అన్నారు.
సుదీప్, నిత్యమీనన్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రాజారత్నం, డైలాగ్స్: శశాంక్ వెన్నెల కంటి, సాహిత్యం: భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందు మౌళి, సంగీతం: డి. ఇమ్మాన్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోని, స్టంట్స్: కనల్‌కణ్ణన్, కథ: టి. శివకుమార్, నిర్మాత: కళ్యాణ్ ధూళిపాళ్ల, దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments