'కోటికొక్కడు' ఆడియో విడుదల
Wednesday, October 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సి.ఎల్.ఎన్.మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి అందిస్తున్న చిత్రం 'కోటికొక్కడు'. తమిళం, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం కోట్లకు పైగా భారీ వసూళ్లను సంపాదించింది. సుదీప్, నిత్యామీనన్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఆడియో వేడుకలో దర్శకరత్న డా||దాసరి నారాయణరావు, శిల్పిక, లగడపాటి శ్రీనివాస్, దీప్తి, ప్రసన్నకుమార్, ప్రియాంక, రామసత్యనారాయణ, లయన్ సాయివెంకట్, ప్రతాని రామకృష్ణ గౌడ్, డి.ఎస్.రావు, రమ్యశ్రీ, శృతి శర్మ, సముద్ర, మనోజ్ నందం తదితరులు పాల్గొన్నారు.
ఆడియో వేడుకలో బిగ్ సీడీని దర్శకరత్న డా||దాసరి నారాయణరావు విడుదల చేశారు. ఆడియో సీడీలను సముద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా...
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - ''లగడపాటి శ్రీనివాస్‌గారు కాకతీయుడు సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. ఇప్పుడు కోటికొక్కడు, 100 డిగ్రీ సెల్సియస్ సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనివాస్‌గారికి కర్నూలు గోపాల్‌గారు, శోభారాణిగారు అండగా నిలబడుతున్నారు. శ్రీనివాస్‌గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''సుదీప్ కెరీర్‌లో ఈగ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. దాని తర్వాత కన్నడంలో కోటికొక్కడు సెన్సేషనల్ హిట్ సాధించింది. మంచి టైటిల్. సుదీప్‌కు తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. శోభారాణిగారు ఏ సినిమా చేసినా భారీ సినిమాలే ఉంటాయి. సి.ఎల్.ఎన్ మీడియా బ్యానర్ పెద్ద నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
డి.ఎస్.రావు మాట్లాడుతూ - ''కోటికొక్కడు కన్నడంలో ఘన విజయాన్ని సాధించింది. కన్నడ కంటే తెలుగులో అతి పెద్ద సక్సెస్ కావాలి'' అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - ''సుదీప్ అందరికీ తెలిసిన హీరో. కన్నడ కంటే తెలుగులో పెద్ద సక్సెస్ కావాలి. నిర్మాత లగడపాటి శ్రీనివాస్‌కు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సముద్ర మాట్లాడుతూ - ''లగడపాటిశ్రీనివాస్ నా దర్శకత్వంలో కాకతీయుడు సినిమాను నిర్మించాడు. ఇప్పుడు కన్నడలో ఘన విజయం సాధించిన కోటికొక్కడు తెలుగులో కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నికిషా పటేల్ మాట్లాడుతూ - ``మలయాళంలో రూపొందిన 100 డిగ్రీ సెల్సియస్‌ను ఇప్పుడు మిత్రన్‌గారు తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.
లక్ష్మీరాయ్ మాట్లాడుతూ - ''ఈ సినిమా ఐదు గురు హీరోయిన్స్‌పై నడిచే రియల్ ఇన్‌సిడెంట్స్‌పై నడుస్తుంది. సి.ఎల్.ఎన్.మీడియా బ్యానర్‌కు గుడ్‌లక్'' అన్నారు.
దర్శకరత్నడా||దాసరి నారాయణరావు మాట్లాడుతూ - ''శోభారాణిగారికి సినిమాలంటే చాలా ప్యాషన్. ఎంత డబ్బు పొగొట్టుకుందో నాకు తెలుసు. అందుకని ఓ సినిమా చేయమని తనకు చెప్పాను. అందుకని తను వండర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను ఎంచుకుంది. డైరెక్టర్ మిత్రన్‌పై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. తమిళంలో ధనుష్‌తో పెద్ద హిట్ మూవీ చేశాడు. మంచి స్టార్ కేస్ట్ ఉన్న చిత్రం. టాప్ హీరోయిన్స్ ఉన్న సినిమాగా ఇది నిలుస్తుంది. చిన్న సినిమాను పెద్దగా తీయాలనుకున్న నిర్మాతలను అభినందిస్తున్నాను'' అన్నారు.
కోటికొక్కడు తారాగణం: సుదీప్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్
సాంకేతిక వర్గం: సంగీతం: డి.ఇమ్మాన్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, స్టంట్స్: కణల్ కన్నన్, కథ: టి.శివకుమార్, సాహిత్యం: భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందు మౌళి, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ: రాజా రత్నం, నిర్మాత: కె.శిల్పిక, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments