కీర్తి సురేష్ నటించిన 'మిస్ ఇండియా 'కొత్తగా కొత్తగా' పాట విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
‘మహానటి’తో జాతీయ ఉత్తమనటి అవార్డుని దక్కించుకున్న కీర్తిసురేశ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి నెలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలో తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘‘కొత్తగా కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగి సారంగమై
లిప్తలో క్షిప్తమై కాననే కాలమే మొలకలే వేసె నా సొంతమై...’’ అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ జీవితంపై తనకున్న పాజిటివ్ దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఈ సాంగ్‌ను యూరప్‌లో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు.
మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్, తమన్ పాటను పాడారు.
ఈ సందర్భంగా...
నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ - ```మహానటి`తో జాతీయ ఉత్తమనటిగా అవార్డును సంపాదించుకున్న కీర్తి సురేశ్‌గారు మనకు గర్వ కారణంగా నిలిచారు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుత సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి నెలలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com