జనతా గ్యారేజ్ పై కోట సంచలన వ్యాఖ్యలు..!
Send us your feedback to audioarticles@vaarta.com
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా...ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమాల్లో పరభాషా నటులు ఎక్కువైపోతున్నారు అంటూ గత కొన్నేళ్లుగా కోట ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా కోట శ్రీనివాసరావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో...జనతా గ్యారేజ్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ కోట ఏమన్నారంటే...మొన్నీ మధ్య ఓ సినిమా రిలీజైంది.
ఈ సినిమాలో మోహన్ లాల్ బాగా చేసాడు అంటున్నారు కానీ...ఆ సినిమాలో హీరో గురించి మాట్లాడడం వినలేదు. మోహన్ లాల్ గ్రేట్ మలయాళం ఏక్టర్. అతన్ని పెట్టుకుని సినిమా చేసి...బాగా చేసాడు అంటే ఎలా..? మరి తెలుగోడు ఏమైపోయాడు..? అతన్ని చూపించాకా తెలుగోడు ఎంత యాక్ట్ చేస్తే నీకు ఆనతాడు..? అంటూ ప్రశ్నించారు కోట. పనైపోతుంది కదా అని వాళ్లని పెట్టుకుంటే మిగిలనవాళ్లు భోజనం చేయక్కర్లేదా..? అని అడుగుతున్నారు. మనమంతా, జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ పాత్రలకు ఆయనే సూటవుతారు అందుకనే మోహన్ లాల్ ని పెట్టుకున్నాం అని డైరెక్టర్స్ చెప్పారు. సరిగ్గా ఆలోచించి చూస్తే...మన దగ్గర అలాంటి పాత్రలు చేయడానికి చాలా మంది నటులు ఉన్నారు. మరి...కోట ప్రశ్నలకు కొరటాల, చంద్రశేఖర్ ఏలేటి ఏం సమాధానం చెబుతారో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments