ఈ డైరెక్ట‌ర్‌కి కొరియ‌న్ రీమేక్ క‌లిసొస్తుందా..!

కొంత మంది డైరెక్ట‌ర్స్‌కు ఎంత మంచి టాలెంట్ ఉన్నా కాలం కలిసి రాక..స‌క్సెస్‌లు ద‌క్క‌వు. ఇలాంటి ద‌ర్శ‌కుల‌కు రీమేక్ సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. రీసెంట్‌గా చూస్తే డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి స‌రైన స‌క్సెస్ లేకుండా ఉన్న స‌మ‌యంలో కొరియ‌న్ చిత్రం మిస్ గ్రానీ రీమేక్‌గా వ‌చ్చిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మ‌రో డైరెక్ట‌ర్ కూడా నందినీ రెడ్డి బాట‌లోనే ప్ర‌యాణించ‌నున్నార‌ట‌. ఇంత‌కూ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?.. శ్రీవాస్‌. ఈయ‌న బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘సాక్ష్యం’ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత మ‌రో సినిమాను శ్రీవాస్ డైరెక్ట్ చేయ‌లేదు.

అయితే సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కొరియన్ మూవీ ‘డాన్స్ క్వీన్’ అనే కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాతలు సునీతా తాటి, డి.సురేశ్ బాబు హక్కులు దక్కించుకున్నారు. ప్రస్తుతం మన నెటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఈ సినిమాను శ్రీవాస్ తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. చివ‌రి కోరిక‌లు తీర్చుకోవాల‌నే దంప‌తుల కథాంశంతో రూపొంద‌నున్న ఈ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఈ రీమేక్ అయినా శ్రీవాస్‌కి క‌లిసొస్తుందేమో చూడాలి.