`ఆచార్య‌` స్క్రిప్ట్ విష‌యంలో కొర‌టాల త‌గ్గ‌డం లేదా..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీమ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొంత పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం కోవిడ్ ప్ర‌భావం స్టార్ట్ కాగానే షూటింగ్ ఆగింది. ఇప్పుడు కోవిడ్ నుండి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ స్టార్స్ సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొర‌టాల శివ కూడా చిరంజీవి ఓకే చెబితే సెట్స్ పైకి వెళ‌దామ‌ని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకా చిరు సైడ్ నుండి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. అయితే ఈ ఖాళీ స‌మ‌యంలో కొర‌టాల త‌దుప‌రి సినిమాను బ‌న్నీతో ఓకే చేయించుకున్నాడు. కాగా.. మ‌రో వైపు ఆచార్య‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను మ‌రింతగా మెరుగుపెడుతున్నాడ‌ట‌. ముఖ్యంగా సినిమాలో చ‌ర‌ణ్ న‌టించబోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీల‌కం. కాబ‌ట్టి దానిపై కొర‌టాల మ‌రింత‌గా వ‌ర్క‌వుట్ చేస్తున్నాడ‌ట‌. దేవ‌దాయ శాఖ‌లోని అవినీతిపై పోరాటం చేసే వ్య‌క్తిగా చిరంజీవి క‌నిపిస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చ‌ర‌ణ్ ప‌వ‌ర్‌పుల్‌గా ఉండే న‌క్స‌లైట్ నాయ‌కుడు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌.

More News

తెలంగాణలో ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్..

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి తన సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.

వైభవంగా సిరివెన్నెల కుమారుడి వివాహం..

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కనిష్ట పుత్రుడు, నటుడు రాజా చెంబోలు ( రాజా భవాని శంకర శర్మ) వివాహం వైభవంగా జరిగింది.

ఏపీలో మరో కొత్త పార్టీ..

ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

తెలుగు రాష్ట్రాల్లో తొలి అడుగు.. అక్కడ థియేటర్లు ఓపెన్..

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

రజినీ సర్.. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు: కుష్బూ

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందించారు.