నిర్మాతగా కొరటాల శివ.. తొలి అవకాశం ఎవరికంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. అందులో భాగంగా పరిమితమైన బడ్జెట్లో సినిమాలు చేయడమే కాకుండా కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెరకెక్కించడం, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు కూడా. డైరెక్టర్స్ విషయానికి వస్తే స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకుడు సుకుమార్ ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థను స్థాపించి తన దర్శకత్వ శాఖలోని వారిని దర్శకులుగా పరిచయం చేస్తున్నారు. వీటిలో కొన్నింటికి సుకుమార్ కథ, మాటలు కూడా అందిస్తుండటం విశేషం.
ఇప్పుడు సుకుమార్ బాటలోకి అడుగు పెడుతున్నాడు మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. రైటర్ నుండి డైరెక్టర్‌గా మారిన కొరటాల శివ ఎప్పటి నుండో నిర్మాతగా మారాలని వెయిట్ చేస్తున్నాడు. సినీ వర్గాల సమాచారం మేరకు రెండు, మూడేళ్లుగా కొరటాల శివ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఇప్పటికి కొరటాల ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. త్వరలోనే ఆయన తన ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయబోతున్నారట. తన దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా సహాయ దర్శకురాలిని డైరెక్టర్‌గా పరిచయం చేయబోతున్నారని సమాచారం. లాక్డౌన్ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments