ఆ అంశాలన్నింటిని టచ్ చేసిన కొరటాల
Send us your feedback to audioarticles@vaarta.com
కొరటాల శివ తీసినవి మూడే మూడు సినిమాలు. అయితే.. మూడింటిలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా.. ఓ సామాజిక అంశాన్ని కొరటాల తెరపైకి తీసుకువస్తున్నట్టు.. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న ఈ సినిమాలో.. పేదరికం, విద్యావ్యవస్థ, అవినీతి, నిరుద్యోగం, వైద్యరంగం వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారని తెలుస్తోంది. ఈ అంశాలను విడివిడిగా టచ్ చేసి శంకర్ లాంటి దర్శకులు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నారు. మరి వీటన్నింటినీ ఒకే సినిమాలో ప్రస్తావిస్తున్న కొరటాల ఎటువంటి విజయాన్ని నమోదు చేస్తారోనని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలను ఏప్రిల్ 7న విజయవాడలో నిర్వహించనున్న ఆడియో విడుదల వేడుకలో రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments