ఆ అంశాల‌న్నింటిని ట‌చ్ చేసిన కొర‌టాల‌

  • IndiaGlitz, [Monday,March 26 2018]

కొరటాల శివ తీసినవి మూడే మూడు సినిమాలు. అయితే.. మూడింటిలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని టచ్ చేస్తూనే వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా.. ఓ సామాజిక అంశాన్ని కొరటాల‌ తెరపైకి తీసుకువస్తున్నట్టు.. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. మహేష్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్న ఈ సినిమాలో.. పేదరికం, విద్యావ్యవస్థ, అవినీతి, నిరుద్యోగం, వైద్యరంగం వంటి సున్నితమైన అంశాలను టచ్ చేశారని తెలుస్తోంది. ఈ అంశాలను విడివిడిగా టచ్ చేసి శంకర్ లాంటి దర్శకులు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నారు. మరి వీటన్నింటినీ ఒకే సినిమాలో ప్రస్తావిస్తున్న కొరటాల ఎటువంటి విజయాన్ని నమోదు చేస్తారోనని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే..   దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలను ఏప్రిల్ 7న విజ‌య‌వాడ‌లో నిర్వహించనున్న ఆడియో విడుదల వేడుకలో రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల‌తో వెంకీ, చైత‌న్య‌?

సినిమాకి కథ ఎంత ముఖ్యమో, నటీనటుల ఎంపిక కూడా అంతే ముఖ్యం.

ఏప్రిల్ 18 నుంచి రాజ్ త‌రుణ్ కొత్త చిత్రం

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్.

మే నెల‌లో మారుతి, చైత‌న్య మూవీ ఫ‌స్ట్‌లుక్‌

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్ర‌చారంలో ఉన్న పేరు).

ఆది, అడివి సాయికిరణ్ సినిమా అప్‌డేట్‌

'ప్రేమకావాలి', 'లవ్లీ' సినిమాలతో వ‌రుస విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన ఈ యంగ్ హీరో..

చిరు సినిమా పై స్పందించిన సుకుమార్‌

గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ గ‌త కొంత కాలంగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.