కేసు ఫైల్ చేసిన కొర‌టాల‌..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శలో ఉండ‌గానే.. సినిమా క‌థ‌ను కొర‌టాల శివ కాపీ కొట్టారంటూ రాజేశ్ మండూరి అనే రైట‌ర్ ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాకుండా ప‌లు ఛానెల్స్‌, యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఓ క్ర‌మంలో రాజేష్ మండూరి నేమ్ బాగా ఫేమ‌స్ అయ్యింది. కొర‌టాల శివ త‌న క‌థ‌ను రిజిష్ట‌ర్ చేయించ‌లేదనే వాద‌న కూడా వినిపించింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఆచార్య క‌థ విష‌యంలో.. రాజేష్ మండూరి త‌న‌పై వ్యాఖ్య‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి రెడీ అయ్యార‌ట‌. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి.. త‌న లాయ‌ర్ స‌హ‌కారంతో రాజేష్ మండూరిపై కొర‌టాల లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌.

‘ఆచార్య’ విషయానికి వస్తే.. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కరోనా వైర‌స్ ఫ్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. ఇప్పుడిప్పుడు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌బెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం విధి విధానాల‌తో స్టార్స్ సినిమాలు చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఈ క‌మ్రంంలో చిరంజీవి అండ్ టీమ్ అక్టోబ‌ర్ నుండి షూటింగ్‌ను స్టార్ట్ చేసేలా స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌.