'జవాన్'కు కొరటాల సపోర్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం 'జవాన్'. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. టైటిల్ వినగానే ఇదేదో దేశభక్తి సినిమా అనుకోవద్దు..దేశభక్తి సినిమా కాదు. కుటుంబం కోసం జవానులా పోరాడే యువకుడి కథ.
ఈ సినిమాకు దర్శకుడు బివిఎస్.రవి. స్క్రిప్ట్ విషయంలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ..దర్శకుడు బివిఎస్ రవికి సహకారం అందించాడట. అందుకు కారణం..కొరటాల శివ, బివిఎస్ రవిలిద్దరూ డిగ్రీ స్నేహితులు కావడమే.
ఇద్దరికీ అప్పటి నుండి మంచి సానిహిత్యం ఉంది. ఆ సానిహిత్యం కారణంగా కొరటాల రవికి స్క్రిప్ట్ విషయంలో తన సహకారాన్ని అందించాడు. బివిఎస్ రవి డైరెక్ట్ చేసిన తొలి సినిమా 'వాంటెడ్' పెద్ద సక్సెస్ కాలేదు. చాలా గ్యాప్ తర్వాత తను డైరెక్ట్ చేసిన సినిమా ఇది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com