కొరటాలకు 'శ్రీమంతుడు' కానుక...
Send us your feedback to audioarticles@vaarta.com
నేనొక్కడినే`, ఆగడు` సినిమా ఫెయిల్యూర్స్ తో మహేష్ లో ఓ రకమైన బెంగ పట్టుకుందనే చెప్పాలి. అయితే కొరటాల శివ గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో రూపొందించిన శ్రీమంతుడు` బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుంది. వంద కోట్ల షేర్ సాధించి బాహుబలి తర్వాత అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డ్ సాధించింది. ఈ సక్సెస్ తో మహేష్ కి ఓ రకంగా ఊపిరి వచ్చిందనాలి. ఈ సక్సెస్ కి కారణమైన కొరటాల శివకి మహేష్ ఎ6 ఆడి కారుని గిఫ్ట్ గా కొనిచ్చాడట.
ప్రస్తుతం కొరటాల మహేష్ బహుమానంతోఉబ్బితబ్బువుతున్నాడట.అఖిల్ సినిమా ఆడియో అయిన తర్వాత మహేష్ నేరుగా ఆడి షోరూమ్ కే వెళ్లారట. అక్కడికి కొరటాలను ఆహ్వానించి ఆడి కారును ఇచ్చారట. మహేష్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారని ఆయన అభిమానులు ఆనందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com