కొరటాల శివ తదుపరి చిత్రం ఫిక్స్ అయ్యిందట
Send us your feedback to audioarticles@vaarta.com
మిర్చి, శ్రీమంతుడు...చిత్రాలతో వరుసగా సంచలన విజయాలు సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పచుకున్న క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ. ఈ రెండు చిత్రాలతో అటు ఆడియోన్స్ ను, ఇటు ఇండస్ట్రీ ని తనవైపు తిప్పుకున్నాడు.తొలి, మలి చిత్రాలను ప్రభాస్, మహేష్ లతో చేసిన కొరటాల శివ నెక్ట్స్ మూవీ ఓ హీరోతో చేస్తాడనే విషయం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
కొరటాల శివ కొత్త సినిమా హీరో ఎవరనే విషయం పై కొంత మంది స్టార్ హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా ఫిక్స్ అయినట్టు సమాచారం. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ సినిమాని కూడా నిర్మిస్తుందట. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్... సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ - కొరటాల సినిమాను అధికారికంగా ప్రకటించి..డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com