భూమిని ఇష్టపడే విద్యార్ధి - మనుషులను ఇష్టపడే ఓ పెద్దాయన వీరిద్దరూ కలిస్తే జనతా గ్యారేజ్
- IndiaGlitz, [Wednesday,August 31 2016]
మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా బ్లాక్ బష్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జనతా గ్యారేజ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివతో ఇంటర్ వ్యూ మీకోసం...
జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏమిటి..?
భూమిని ఇష్టపడే వ్యక్తి ఒకరు. మనుషులను ఇష్టపడే వారు ఇంకొకరు. వీరిద్దరూ కలిస్తే ఏం జరిగింది అనేదే మెయిన్ కాన్సెప్ట్.
ఈ కాన్సెప్ట్ కి స్పూర్తి ఏమిటి..?
పర్యావరణం గురించి ఎవరు ఏం చెప్పినా ఇలా విని అలా వదిలేస్తున్నాం. అడ్డం వచ్చిన చెట్లును నరికేస్తున్నాం కానీ...కొత్తగా ఎక్కడా చెట్లను నాటడం లేదు. పర్యావరణం కాపాడాలని చెప్పేవాళ్లే హీరోలు అయితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది.
సెన్సార్ పూర్తైన తర్వాత 8 నిమిషాల నిడివి తగ్గించారని తెలిసింది నిజమేనా..?
అలాంటిది ఏం లేదండి. సెన్సార్ కి ఏం చూపించామో అదే రిలీజ్ చేస్తున్నాం. అవసరమైతే వచ్చేవారం ఓ 10 నిమిషాలు పెంచుతాం.
ఈ కథను ముందు ఎన్టీఆర్ కే చెప్పారా..? లేక వేరే హీరో ఎవరికైనా చెప్పారా..?
ఈ కథకి ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది అనిపించింది. ఎన్టీఆర్ కి చెప్పగానే ఓకే చేద్దాం అన్నారు. చేసేసాం... ఫైనల్ గా సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నాం. ఈ కథకి ఎన్టీఆర్ తప్ప వేరే ఎవర్నీ అనుకోలేదు ఎవరికీ కథ చెప్పలేదు.
రభస టైమ్ లో ఎన్టీఆర్ కి మీరు కథ చెబితే....ఇంత లేట్ అవ్వడానికి రీజన్ ఏమిటి..?ఇప్పుడు అవకాశం ఇవ్వడానికి కారణం మీ సక్సెస్సే అనుకోవచ్చా..?
సక్సెస్సే అనుకోవచ్చా అంటే అదీ ఒక కారణం కావచ్చు. అయితే...అప్పటికి నేను వేరే సినిమా కమిట్ అయ్యాను. అలాగే ఎన్టీఆర్ గారు కూడా వేరే కమిట్ మెంట్స్ లో ఉన్నారు. అందువలన మా కాంబినేషన్ కాస్త లేట్ అయ్యింది.
మెహన్ లాల్ ని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఉందా..?
కథ రాసుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ కి మోహన్ లాల్ అయితే బాగుంటుంది అనిపించింది. అయితే...చేస్తారో..చేయరో అనే సందేహం. ఆయన్ని కలిసి కథ వినిపించాను.కథ విన్న తర్వాత నేను చేస్తున్నాను అని చెప్పారు. అంతే తప్ప ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు.
ఇంతకీ జనతా గ్యారేజ్ రన్ టైమ్ ఎంత..?
2 గంటల 38 నిమిషాలు.
మీ గత చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు చిత్రాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి కదా..మరి ఇందులో..?
ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అయితే...కొత్త రకమైన ఫ్యామిలీ డ్రామా ఉంటుంది.
స్పెషల్ సాంగ్ కోసం ముందు తమన్నా అనుకున్నారు కదా...కాజల్ తో చేయడానికి కారణం సెంటిమెంటా..?
తమన్నా తో పాటు ఇంకో రెండు మూడు పేర్లు అనుకున్నాం. ఫైనల్ గా స్పెషల్ సాంగ్ కాజల్ తో చేసాం అంతే కానీ...సెంటిమెంట్ ఏం కాదండి...!
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్..మీ మూడు చిత్రాలకు దేవిశ్రీప్రసాదే మ్యూజిక్ అందించారు. వేరే మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం ఇవ్వరా..?
ప్రణామం అనే డిఫరెంట్ సాంగ్, డ్యాన్స్ సాంగ్స్ 2, అలాగే ఎమోషన్ గా ఉండే సాంగ్స్...ఇలా డిఫరెంట్ సాంగ్స్ ఇందులో ఉన్నాయి. దేవీ అయితే బాగా చేస్తాడు. అయినా నా రెండు చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. అలాంటప్పుడు ఎందుకు మార్చాలి అనిపించింది. ఈ సినిమాకి కూడా ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు.
మీ సినిమాల్లో అంతగా కామెడీ ఉండదు అనే టాక్ ఉంది. కామెడీ లేకపోతే రిస్క్ ఏమో..?
కథని ఎమోషనల్ గా చెబుతున్నప్పుడు మధ్యలో కామెడీ ట్రాక్ పెట్టి కథను డ్రాప్ చేయడం ఇష్టం ఉండదు. కథలో రిలీఫ్ ఇవ్వడం అనేది డేంజర్ అని నా ఫీలింగ్. బాహుబలి సినిమాకి వెళితే కామెడీ కోసం వెళ్లం కదా..! అలాగే ఛత్రపతి సినిమాలో కామెడీ సీన్ మిస్సైన ఫరలేదు కానీ ఇంటర్వెల్ సీన్ మిస్ కాకుండా చూస్తాం. అందుచేత కథని డిస్టర్బ్ చేసేలా కామెడీ ఉండకూడదు అనుకుంటాను. భవిష్యత్ లో కేవలం కామెడీ కోసం ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ తీస్తాను.
ఎన్టీఆర్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఇంట్రస్ట్ తో డైలాగులు రాస్తాను అన్నారు కదా..మూవీలో వంశానికి సంబంధించిన డైలాగ్స్ ఉంటాయా..?
డైలాగ్స్ కథకనుగుణంగానే ఉంటాయి తప్పా..కావాలని ఏదో చెప్పినట్టుగా డైలాగ్స్ ఉండవు. ఈ సినిమాలో హీరోకు పెద్ద కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబానికి సంబంధించి అవసరాని బట్టి డైలాగ్స్ ఉంటాయి.
తదుపరి చిత్రం ఎప్పుడు..?
మహేష్ తో చేస్తున్నాను. జనవరిలో షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాం.