'శ్రీమంతుడు' బాటలోనే..
Send us your feedback to audioarticles@vaarta.com
'మిర్చి', 'శ్రీమంతుడు'.. ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. తన మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించనున్నాడు. ఈ రోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. కొబ్బరి కాయ కొట్టినరోజే సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయమేమిటంటే.. కొరటాల శివ గత చిత్రం 'శ్రీమంతుడు' కూడా ఆగస్టు ప్రథమార్థంలోనే విడుదలై ఘనవిజయం సాధించింది. మరి తారక్, కొరటాల శివ కాంబినేషన్ చిత్రం కూడా అదే బాటలో పయనిస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com