మండిపడ్డ కొరటాల
- IndiaGlitz, [Friday,December 07 2018]
ఓటు వేయడం మనందరి హక్కు. భవిష్యత్తు బాగుండాలంటే బద్ధకాన్ని వదిలి అందరూ ఓటు వేయాలి అని ఎన్నికల కమిషన్ ఎన్నికల గురించి ప్రకటించినప్పటి నుంచీ ప్రచారం చేస్తూనే ఉంది. సెలబ్రిటీలు కూడా తమవంతుగా ఎన్నో సార్లు ఈ విషయాన్ని చెప్పారు.
ఎవరు ఎలా చెప్పినా, ఓటర్లు మాత్రం తమకు నచ్చిందే చేశారు. హైదరాబాద్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా దాదాపు 35 శాతం ఓటిగే నమోదైంది. దీనికి సంబంధించి కొరటాల శివ సామాజిక మాధ్యమంలో మండిపడ్డారు.
నగరవాసులకు ఏమైందని? ఇంత తక్కువ ఓటింగ్ శాతం ఎందుకు నమోదవుతోందని ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్లో పోలింగ్ శాతం పట్ల ఎంతో మంది నిరాశ చెందారన్నది వాస్తవం.