మహేశ్ కోసం పర్యవేక్షణ చేస్తున్న కొరటాల..!
Send us your feedback to audioarticles@vaarta.com
రైటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన కొరటాల శివ ఇప్పుడు స్టార్ రైటర్ రేంజ్‌కు ఎదిగాడు. ఒకవైపు సినిమాలను డైరెక్ట్ చేయడమే కాదు.. సినిమా ప్రాజెక్ట్స్‌ను సెట్ చేయడం, సినిమా బిజినెస్ వ్యవహారాల్లో భాగం కావడం వంటి పనులను సైలెంట్‌గా కొరటాల చేస్తున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బన్నీతో చేస్తున్న సినిమాకు తన స్నేహితుడిని నిర్మాతగా మారుస్తున్నాడు కొరటాల శివ. అగ్ర హీరోలతో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ సినిమా నిర్మాణంలో సైలెంట్ పార్టనర్‌గా మారుతున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కొరటాల శివకు సూపర్‌స్టార్ మహేశ్‌కు మంచి అనుబంధం క్రియేట్ అయ్యింది. మహేశ్‌తో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసి సెన్సేషనల్ హిట్ మూవీస్‌గా మలచడంతో కొరటాల శివతో మహేశ్ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రిలేషన్‌తోనే కొరటాల శివ ఓ కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నాడట. వివరాల మేరకు.. డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట. రీసెంట్‌గానే వెంకీ కుడుముల చెప్పిన లైన్ నచ్చడంతో కొరటాల పర్యవేక్షణలో మహేశ్ స్క్రిప్ట్ డెవలప్ చేయమని చెప్పాడట. స్క్రిప్ట్ బాగా నచ్చి టైమ్ కుదిరితే మహేశ్ ఆ సినిమాలో నటిస్తాడు. కుదరకపోతే.. మరో హీరోతో అయినా సినిమాను నిర్మించేలా ప్లాన్స్ జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments