ఆ ఇద్దరు మిస్సయినా.. కొరటాల మిస్ కాలేదు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో తొలి చిత్రంతో విజయం సాధించిన పలువురు తెలుగు దర్శకులు.. రెండో సినిమాకి వచ్చేసరికి ద్వితీయ విఘ్నం సమస్యతో పరాజయం పాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. మహేష్‌తో పనిచేసిన దర్శకులు మాత్రం అందుకు మినహాయింపు. నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన రచయిత త్రివిక్రమ్ తన రెండో చిత్రం అతడుతో విజయం అందుకుంటే..
కొత్త బంగారు లోకంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ద్వితీయ విఘ్నం అధిగమించారు. ఇక మిర్చితో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన కొరటాల శివ శ్రీమంతుడుతో ఈ పరిస్థితిని అధిగమించారు. ఈ ముగ్గురూ దర్శకులకి సంబంధించి మరో విశేషమేమిటంటే.. తమ మూడో చిత్రాన్ని వేరే హీరోలతో చేసినా.. నాలుగో చిత్రం మాత్రం మహేష్‌తోనే చేయడం. అయితే.. ఈ విషయంలో త్రివిక్రమ్ (ఖలేజా), శ్రీకాంత్ అడ్డాల (బ్రహ్మోత్సం) పరాజయాల పాలయితే.. కొరటాల శివ మాత్రం భరత్ అనే నేనుతో రెండో సారీ విజయాన్ని అందుకుని వార్తల్లో నిలిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments