రూటు మారుస్తున్న కొర‌టాల‌

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

కొర‌టాల శివ‌.. వ‌రుస‌గా నాలుగు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తెలుగు ద‌ర్శ‌కుడి పేరిది. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ నాలుగు విజ‌యాల‌ను అందుకున్నారు. ఈ నాలుగు సినిమాల‌లోనూ ఏదో ఒక సందేశాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు కొర‌టాల‌. దీంతో.. త‌దుప‌రి చిత్రంలోనూ దాన్ని కొన‌సాగిస్తారేమో అనుకుంటున్న వాళ్ళ‌కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్నారు కొర‌టాల.  త‌న ఐదో చిత్రం పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ఉంటుందని.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో మెసేజ్ హెవీగా ఉండ‌ద‌ని..

ఆయ‌న చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లే ఏర్పాట్లలో ఉన్న కొరటాల‌..  విహారాల నుండి తిరిగిరాగానే త‌న కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ఒక‌వేళ అది వ‌ర్క‌వుట్ అయితే.. మెగా ఫ్యామిలీ హీరోతో కొర‌టాల శివ చేసే తొలి సినిమా ఇదే అవుతుంది.