పొలిటికల్ టచ్‌తో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ 'భరత్ అనే నేను'- కొరటాల శివ
Send us your feedback to audioarticles@vaarta.com
'శ్రీమంతుడు' వంటి ఇండ్రస్టీ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సూపర్‌స్టార్ మహేశ్ సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు, అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఏప్రిల్ 20న 'భరత్ అనే నేను' చిత్రం ప్రపంచవ్యాప్తంగా హైయ్యస్ట్ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్‌తో నిర్మించారు.
రిలీజ్ సందర్భంగా ఏప్రిల్ 19న హైదరాబాద్ జూబ్లీ రిడ్జ్ హోటల్లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ డైరెక్టర్ కొరటాల శివ, స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి., ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.
సూపర్ డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ - ''సినిమా ప్రమోషన్ బిగినింగ్ నుండి ఇప్పటివరకు చాలా హైప్ వచ్చింది. ఇంత హైప్ రావడానికి, పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా థాంక్స్. లాస్ట్ వన్ వీక్ నుండి మా టీమ్ అంతా డే అండ్ నైట్ కష్టపడి వర్క్ చేశాం. పెద్ద కాన్వాస్ వున్న ఫిల్మ్‌కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా త్వరగా ఫినిష్ అవడానికి మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరునా నా థాంక్స్. ఈ కథ ఎప్పుడో రాసుకున్నాను. మహేశ్ స్క్రిప్ట్ ఒకసారి విని, ఓకే చేసిన తర్వాత ఎంతో ఇన్వాల్వ్ అయి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. సినిమాలో ఇన్వాల్వ్ అయి, పర్సనల్‌గా చాలా కేర్ తీసుకొని ఈ సినిమా చేశారు.
కథ వినగానే చాలా ఇంట్రెస్టింగ్గా వుంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంత స్పాన్ వున్న కథ రాయడం చాలా కష్టం సార్ అన్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్‌కి స్పెషల్ థాంక్స్. సినిమా అంతా పూర్తయింది. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ఓవర్సీస్ ప్రింట్స్ కూడా వెళ్లాయి. ఇది రెగ్యులర్ సినిమా కాదు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వుంటూ పొలిటికల్ టచ్‌తో వుంటుంది. ఇలాంటి సినిమాకి పాటలు కథకి అనుగుణంగా వుండాలి. ఆడియన్స్‌ని ఆ మూడ్‌లో కూర్చోబెట్టాలి అని చాలా కేర్ తీసుకున్నాం. దేవి కథ విని దానికి తగ్గట్లుగా ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ కంపోజ్ చేసిన దేవికి హ్యాట్సాఫ్. రామజోగయ్యశాస్త్రి సిట్చ్యుయేషన్ని అర్థం చేసుకొని లిరిక్స్ రాశారు. వారిద్దరికీ స్పెషల్ థాంక్స్. ఈ సినిమాకి రవి కె. చంద్రన్, తిరు ఇద్దరు టాప్ కెమెరామెన్స్‌తో వర్క్ చేసే అవకాశం దక్కింది. వారితో పని చేసినప్పుడల్లా ఏదో ఒక క్రొత్త విషయం నేర్చుకోవచ్చు. మేకింగ్ వైజ్‌గా వారి దగ్గర చాలా నేర్చుకున్నాను.
ఇద్దరూ సినిమా అందంగా ప్రజెంట్ చేశారు. వారికి నా సిన్సియర్ థాంక్స్. కియారా ఆద్వానీ ఫస్ట్‌టైమ్ తెలుగులో నటించింది. తన డైలాగులు అన్నీ ముందుగానే ప్రిపేర్ అయి నేర్చుకుని చేసింది. వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. చాలా ఎఫర్ట్ పెట్టి చేసింది. పొలిటికల్ సినిమా. పెద్ద స్పాన్ వున్న సినిమా కాబట్టి ఆర్టిస్ట్‌లు చాలామంది నటించారు. ప్రకాష్ రాజ్, పోసాని, శరత్‌కుమార్, అజయ్, సితార వంటి ప్రముఖులు నటించడంతో నాకు చాలా ఈజీ అయ్యింది. ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రార్డినరీగా నటించారు. ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రియలిస్టిక్ ఎట్మాస్ఫియర్తో సెట్స్ వేశారు. రాజు, దినేష్ మాస్టర్ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ చేశారు. 'వచ్చాడయ్యో సామి' పాటకి దినేష్ మాస్టర్ అవార్డు వస్తుందని చెప్పాడు. చాలా హ్యాపీగా అన్పించింది. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు సొంత సినిమాలా భావించి వర్క్ చేశారు. 'మిర్చి' తర్వాత దానయ్యగారికి సినిమా చెయ్యాలి. 'జనతా గ్యారేజ్' తర్వాత దానయ్యగారికి కాల్ చేసి సినిమా చేద్దాం అని ఆఫీస్‌కి పిలిచాను. మహేశ్‌గారితో సినిమా అనగానే ఆయన మహేశ్‌తో సినిమా తీయడం నా కల అన్నారు. దానయ్యగారి ఆఫీస్‌కి ఫస్ట్ ఎంటర్ అవగానే బాగా రెస్పెక్ట్ వచ్చే సినిమా కావాలి అన్నారు. తర్వాత సినిమా రిచ్‌గా వుండాలి. పెద్ద సినిమా ఇవ్వండి అన్నారు.
నాకు ఎప్పుడూ ఆయన గురించే టెన్షన్ వుండేది. ఫ్యాన్స్‌ని ఈజీగా శాటిస్ఫై చెయ్యొచ్చు.. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రతి సీన్ రిచ్‌గా, గ్రాండ్‌గా వుండాలి అని చూసుకునేవాడ్ని. నెంబరాఫ్ డేస్ పెరిగాయి. నా మూడు సినిమాల కన్నా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా దానయ్యగారు సినిమాని గ్రాండ్‌గా నిర్మించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ ఆయన చరిత్రని మార్చబోయే సినిమాలను తీస్తున్నారు. పెద్ద కంటెంట్ వున్న సినిమా. రెండు పార్ట్‌లుగా తియ్యాల్సిన సినిమా. నాలుగు గంటలు వచ్చింది. ప్రతి సీన్, ప్రతి షాట్ అద్భుతంగా చేశాం. అంత పెద్ద స్పాన్ వున్న సినిమాని మూడు గంటల్లో కుదించి శ్రీకర్ ప్రసాద్ అద్భుతంగా ఎడిట్ చేశారు. మేం కావాలనుకున్న సీన్స్ అన్నీ వుంచి సినిమాని గ్రిప్పింగ్‌గా చేశారు. అందుకే ఆయన బెస్ట్ ఎడిటర్ అయ్యారు'' అన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''మా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్ బేనర్లో 'భరత్ అనే నేను'లాంటి గొప్ప సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. అది కొరటాల శివగారి వల్ల కలగడం చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన శివకి జీవితాంతం రుణపడి వుంటాను. చాలా మంచి వ్యక్తి. అందరూ గర్వించే సినిమా తీశారు. నేను గర్వంగా చెప్పుకునే సినిమా ఇచ్చారు. మహేశ్‌గారితో సినిమా తియ్యాలన్న నా కోరిక ఈ సినిమా ద్వారా తీరినందుకు ఆనందంగా వుంది. సినిమా బ్లాక్ బస్టర్ అని అందరూ అడ్వాన్స్డ్గా కంగ్రాట్స్ చెపుతుంటే చాలా ఆనందంగా వుంది. మా బేనర్లో ఇలాంటి గొప్ప సినిమా చేసిన కొరటాల శివగారికి మా ఫ్యామిలీ మొత్తం జీవితాంతం రుణపడి వుంటాం. అలాగే మా చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' అన్నారు.
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - ''భరత్ అనే నేను' సినిమా ఒక నిజాయితీతో కూడిన ఒక అద్భుతం. కొరటాల శివగారితో ఫస్ట్ నుండి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఆలోచనలు, సినిమా తీసే విధానం చాలా గొప్పగా వుంటుంది. రెండు పాటలు చూసాను. లొకేషన్లో, సీన్స్ తీసేటప్పుడు. పాటల్ని చిత్రీకరించేటప్పుడు చూశాను. మహేశ్‌గారి పెర్ఫార్మెన్స్ అద్భుతం. చాలా హానెస్ట్తో కూడిన సినిమా. మనందరికీ నచ్చుతుంది. కమర్షియల్‌గా వుంటూనే అందర్నీ ఆలోచింపజేసే విధంగా వుంటుంది. మంచి సందేశాత్మకంగా కొరటాల శివరగారు తీశారు. మహేశ్ ఫ్యాన్స్‌కి, కొరటాల శివగారి ఫ్యాన్స్ విపరీతంగా నచ్చే సినిమా ఇది. ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసిన రెండు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. 'భరత్ అనే నేను' పాట రిలీజ్ అయిన డే వన్ నుండి 'ఓ వసుమతి' చివరి పాట దాకా ప్రతి ఒక్క పాటకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా లిరిక్స్ అద్భుతంగా వున్నాయని సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. అశ్వనీదత్‌గారు పాటలన్నీ అర్థవంతంగా వున్నాయి.
చాలా గొప్పగా రాశారు అని అప్రిషియేట్ చేశారు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కథానుసారంగా పాటలు వుంటాయి. కథకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న మూమెంట్స్‌తో పాటల్ని చిత్రీకరించారు. ఇంత మంచి పాటల్ని రాయించిన కొరటాల శివగారికి నా థాంక్స్. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ కాంట్రిబ్యూషన్ మర్చిపోలేనిది. ప్రతి ఒక్కళ్లు పాటలు బాగున్నాయి అని అంటే అది దేవి కృషి చాలా వుంది. రీ-రికార్డింగ్ బ్రహ్మాండంగా చేశారు. మా ఈ పోర్ట్‌ఫోలియోకి గౌరవం దక్కించిన కొరటాల శివగారికి మా థాంక్స్. మహేశ్‌కి, కొరటాల శివకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుందని నా ప్రగాడ నమ్మకం. ఇంత పెద్ద స్పాన్ వున్న సినిమాని నిర్మించిన దానయ్యగారికి కృతజ్ఞతలు'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments