క‌థ నాది..స‌ల‌హా స్నేహితుడిది - కొర‌టాల‌

  • IndiaGlitz, [Monday,April 16 2018]

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో మ‌హేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కియరా అద్వానీ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ నెల 20న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ హాట్ టాపిక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఈ సినిమా కథ నచ్చి వేరే రచయిత దగ్గర నుంచి.. కోటి రూపాయలు ఇచ్చి మరీ కొరటాల కొన్నారని టాలీవుడ్‌లో ర‌క‌ర‌కాల‌ కథనాలు వినిపిస్తున్నాయి.

అంతేగాకుండా.. ఈ సినిమా టైటిల్స్‌లో ఆ రచయితకి క్రెడిట్ ఇవ్వనున్నారని కూడా వార్తలు వ‌చ్చాయి. తాజాగా.. కొరటాల ఈ విష‌యంపై స్పందించారు. స్వతహాగా రచయిత అయిన తన దగ్గర పది బౌండెడ్‌ కథలు స్క్రిప్ట్‌తో పాటు రెడీగా ఉంటాయనీ.. అలాంటిది వేరే వారి దగ్గర నుంచి కథను కొనుక్కోవలసిన అవసరం లేదనీ.. ఇది తన సొంత కథ అని వివ‌ర‌ణ ఇచ్చారు. హీరో ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని తన స్నేహితుడు చెప్పడంతో.. ‘భరత్ అనే నేను’ కథను రాసుకున్నానని క్లారిటీ ఇచ్చేశారు ఈ స‌క్సెస్‌ఫుల్‌ డైరెక్టర్.