Devara:జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. దేవర గురించి సూపర్ అప్టేడ్

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుకు అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న దేవర చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల చేయనున్నట్లు కొరటాల అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కథ చాలా పెద్దదని అందుకే రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. దేవర పార్ట్ 1ను 2024 ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. కొరటాల ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తమ హీరో సోలోగా నటిస్తున్న దేవర సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోవాలని కామెంట్స్ చేస్తు్న్నారు.

దేవర సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు..

మరోవైపు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే చాలా షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇటీవల ఎన్టీఆర్‌పై యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరించారు. సముద్రం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. దేవర సినిమాతో ఆ వేవ్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్‌కు జోడిగా దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వార్-2, టైగర్-3 మూవీలతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ..

ఇక 2015లో టెంపర్ సినిమాతో మొదలైన ఎన్టీఆర్ విజయ పరంపర ఆర్ఆర్ఆర్ సినిమా వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో వచ్చిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అయితే తారక్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆస్కార్ అవార్డుతో పాటు పలు ప్రఖ్యాత అవార్డులు కూడా ఈ సినిమాకు వచ్చాయి. మరోవైపు బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2, సల్మాన్ ఖాన్ టైగర్-౩ మూవీలో జూనియర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

More News

Nara Lokesh:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈనెల 12వరకు లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో

Ramcharan:మిస్టర్ కూల్ ధోనీని కలిసిన రామ్‌చరణ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో

Bandi Sanjay:ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో చీలిక వచ్చింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Vande Bharat :వందేభారత్ స్లీపర్ కోచ్‌ల డిజైన్లు విడుదల.. 2024 మొదట్లో అందుబాటులోకి..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు పట్టాలపై తిరుగుతున్నాయి.

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు .. స్పందించని జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరగనున్న తన వారాహి యాత్రలో దాడులు చేస్తారని..