Korameenu: 'కొరమీను' ట్రైలర్.. డిసెంబర్ 31న మూవీ రిలీజ్

  • IndiaGlitz, [Thursday,December 22 2022]

విజ‌య‌వాడ‌లో నేర‌స్థుల‌కు సింహ స్వ‌ప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీస‌ర్ మీసాల రాజు అలియాస్ సీతారామ‌రాజు విశాఖ ప‌ట్నం సిటీకి ట్రాన్స్‌ఫ‌ర్స్ అయ్యారు అనే డైలాగ్‌తో కొర‌మీను (Korameenu) ట్రైల‌ర్ ప్రారంభం అవుతుంది. ఈ డైలాగ్ వ‌చ్చే సమ‌యంలోనే మీసాల రాజుగా యాక్ట‌ర్ శ‌త్రు ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చారు.

విశాఖ‌కు వ‌చ్చిన మీసాల రాజుకి మీసాలుండ‌వు. అదే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. సీతారామ‌రాజుకి అది పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది. మ‌రో వైపు విశాఖ న‌గరంలోని జాల‌రి పేట‌లో డ్ర‌గ్స్‌కి సంబంధించిన గొడ‌వ జ‌రుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేక‌ప్ చేస్తాడు. మ‌రో వైపు జాల‌రి పేట‌లో ఉండే డాన్ క‌రుణ ఆ ప్రాంతాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. ఈ పాత్ర‌లో హ‌రీష్ ఉత్త‌మ‌న్ క‌నిపించారు. అలాంటి క‌రుణాకి రైట్ హ్యాండ్ కోటి. పాత్ర‌ను మ‌న క‌థానాయ‌కుడు ఆనంద్ ర‌వి (Anand Ravi)పోషించారు.

క‌రుణ‌కి, కోటికి ఓ చిన్న గొడ‌వ‌.. కోటి, మీనాక్షి ప్రేమికులు. కోటి ప్రేమ విష‌యం న‌చ్చ‌ని క‌రుణ అత‌నికి వారం రోజులు టైమ్ ఇచ్చి జాల‌రి పేట‌ను విడిచిపోవాల‌ని కండీష‌న్ పెడ‌తాడు. అస‌లు పోలీస్ ఆఫీస‌ర్ మీసాల రాజు.. జాల‌రి పేట డాన్ క‌రుణ.. ల‌వ‌ర్స్‌ కోటి - మీనాక్షి మధ్య నడిచే క‌థే ‘కొరమీను’.

మరి కరుణ ఇచ్చిన వార్నింగ్‌కి కోటి - మీనాక్షి భ‌య‌ప‌డ్డారా? మీసాల రాజు వీరి మ‌ధ్య ఏం చేశాడు అనే విష‌యం తెలియాలంటే కొర‌మీను సినిమా చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్‌. ఆనంద్ ర‌వి హీరోగా న‌టిస్తోన్న కొరమీను చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీప‌తి క‌ర్రి ద‌ర్శ‌క‌త్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. స్టోరీస్ ఆఫ్ ఇగోస్ అనే క్యాప్ష‌న్ పెట్టారంటేనే సినిమా క‌థాంశ‌మేంటో అర్థం చేసుకోవ‌చ్చు.

కొర‌మీను సినిమా ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై ఓ రేంజ్ అంచ‌నాల‌ను పెంచితే.. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే క్యూరియాసిటీ అని అంద‌రిలో పెరిగింది. ‘కొరమీను’ చిత్రాన్ని గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.

న‌టీన‌టులు: కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

More News

Khudiram Bose: డిసెంబర్ 22న పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన

ఈరోజు మ‌నం అనుభ‌విస్తున్న స్వేచ్ఛ‌, స్వాతంత్య్రాల కోసం ఎందరో మ‌హ‌నీయులు వారి ప్రాణాల‌ను తృణ ప్రాయంగా త్య‌జించారు.

Balakrishna: ఆ హీరో అంటే క్రష్ అన్న స్టార్ హీరోయిన్... జయసుధ, జయప్రద, రాశీఖన్నాలతో బాలయ్య ట్రిపుల్ ధమాకా

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’’ (Unstoppable2)

Theater & OTT Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే... ఒకే రోజు దిగుతున్న రవితేజ, నిఖిల్

కరోనా కారణంగా ఓటీటీ మార్కెట్ బాగా వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు..

Omicron BF 7 Variant : భారత్‌లోకి ప్రవేశించిన బీఎఫ్. 7 వేరియంట్ ... అప్పుడే నాలుగు కేసులు, కేంద్రం అలర్ట్

ప్రస్తుతం చైనాలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీకి సంబంధించిన నిబంధనలు

Rajayogam: అన్ని కమర్షియల్ అంశాలతో 'రాజయోగం' ట్రైలర్ ఆకట్టుకుంది - దర్శకుడు మారుతి

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'రాజయోగం'.